ధోనికి ఐపీఎల్ కష్టమే.. గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్  ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు అనే విషయం తెలిసిందే.  భారత క్రికెట్ ఆటగాళ్ల గురించి ఎప్పుడూ ఏదో ఒకటి కామెంట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు. ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని విషయంలో ఇప్పటివరకు ఎన్నో సార్లు గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనం గా మారిపోయాయి. ఇక ఇప్పుడు మరో సారి ధోనిపై అక్కసును వెళ్లగక్కాడు గౌతం గంభీర్.  ఐపీఎల్ రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేయడం చాలా కష్టం అంటూ  అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు

 సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండవ దశ  ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు తలపడుతుంది. అయితే అందరి కంటే ముందు యూఏఈ చేరుకున్న సీఎస్కే జట్టు అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. ఇక ధోనీ ఎంతో అద్భుతంగా షాట్లు ఆడుతున్నాడని.. భారీగా సిక్సర్లు కొడుతున్నాడు అంటూ ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లతో పాటు జట్టు యాజమాన్యం కూడా సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలను షేర్ చేసింది. అయితే ఐపీఎల్ మొదటి దశలో ఏడు మ్యాచ్లు ఆడిన మహేంద్రసింగ్ ధోని కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక పరుగులు కేవలం 18 మాత్రమే కావడం గమనార్హం

 ఈ క్రమంలోనే ఇటీవలే గౌతమ్ గంబీర్ రెండవదశ ఐపీఎల్ లో ధోని ఆట గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. ఐపీఎల్ చాలా క్లిష్టమైన టోర్నీ.. ధోని పరుగులు చేయడం చాలా కష్టం.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లేదా మరో టోర్నీ లాగా ఐపీఎల్ కాదు.. ఐపీఎల్లో ఎప్పుడూ అత్యుత్తమ బౌలర్లు మాత్రమే ఆడుతూ ఉంటారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరమైన మహేంద్రసింగ్ ధోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు చేయడం చాలా కష్టం.. అందుకే ధోని ఎక్కువగా ఆశించకూడదు అంటూ గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోని కేవలం వికెట్ కీపర్గా టీంకి మెంటర్ పాత్ర మాత్రమే పోషించడం పై దృష్టి పెడుతున్నాడు అంటూ గౌతం పని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: