ధోని, గంగూలీ.. బెస్ట్ కెప్టెన్ ఎవరు.. వీరేంద్ర సెహ్వాగ్ సమాధానం ఇది?

praveen
మహేంద్ర సింగ్, ధోనీ సౌరవ్ గంగూలీ.. ఇద్దరు కూడా ప్రస్తుతం భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్నారు.  ఇద్దరు తమదైన శైలిలో ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు సారథ్య బాధ్యతలు నిర్వహించారు. టీమ్ ఇండియా కి దూకుడుగా ఆడటాన్ని సౌరవ్ గంగూలీ నేర్పిస్తే.. టీమిండియాకు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ను ఏకంగా మూడుసార్లు అందించాడు మహేంద్రసింగ్ ధోని.  ఇక వీరిద్దరూ భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెనన్స్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అయితే.. అందరితో పోల్చుకుంటే వీరిద్దరూ బెస్ట్ కెప్టెన్స్.. ఇది నిజమే.. కానీ వీరిద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అన్నదానిపై మాత్రం  అటు మాజీ ఆటగాళ్లు సైతం అంత తేలికగా సమాధానం చెప్పలేరు.

 మరోవైపు అభిమానులను అడిగినా కూడా  బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పడానికి కాస్త ఆలోచనలో పడి పోతూ ఉంటారు.  ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ క మాత్రం ఈ ప్రశ్నకు ఎంతో తెలివిగా సమాధానం చెప్పి ఆకట్టుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇటీవలే సోషల్ మీడియా వేదికగా అటు అభిమానులతో ముచ్చటించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.

 సౌరవ్ గంగూలి మహేంద్ర సింగ్ ధోనీ లలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అని అడగగా.. భారత క్రికెట్ చరిత్రలో ఇద్దరు కూడా మంచి సారధులే.. కానీ నా వరకు మాత్రం సౌరవ్ గంగూలీ బెస్ట్ కెప్టెన్ ఎందుకంటే..  భారత జట్టులోకి యువ ఆటగాళ్లను ఎంచుకుని వారితో జట్టును ఎంతో పటిష్టంగా నిర్మించడంలో సౌరవ్ గంగూలీ పాత్ర ఎంతో కీలకంగా ఉంది. విదేశాల్లో ఎలా రాణించాలి అన్న విషయాన్ని కూడా టీమిండియాలో ఆటగాళ్లకు నేర్పించాడు సౌరవ్ గంగూలి. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయ్యే సమయానికి జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. ఇక కొత్తగా పటిష్టమైన జట్టును నిర్మించాల్సిన అవసరం ధోని కి లేకుండా పోయింది. అందుకే గంగూలీ బెస్ట్ కెప్టెన్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ సమాధానం చెప్పాడు.  కాగా ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా రికార్డు కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: