పాక్ లో తలదాచుకున్న .. ఆఫ్ఘన్ మహిళా క్రీడాకారులు ..

Chandrasekhar Reddy
తాలిబన్ ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన విషయం తెలిసిందే. మొదటి నుండి అనుకున్నట్టుగానే గత తాలిబన్ పాలన మళ్ళీ తేనున్నట్టు ఆ కొత్త ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే అప్పట్లో షరియా చట్టాన్నే అమలు పరిచేవారు. ఈ చట్టాల అమలు చాలా కఠినంగా ఉండటం చూశాం. అదే తరహాలో ఇప్పుడూ ఉండనుంది. కానీ ప్రపంచానికి తాము మారినట్టు కొత్త రంగు పులుముకోడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. చెప్పినంత సేపు కూడా వారు అవి పాటించలేకపోవడం తో ప్రపంచం ముందు మరోసారి దోషి గా నిలబడుతూనే ఉంది. కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికే తాము మారినట్టు నాటకాలు ఆడుతుంది తప్ప మరలేదనే ప్రతి నడవడిక స్పస్టంగా తెలియజేస్తూనే ఉంది.
షరియా చట్టం ప్రకారం స్త్రీలకు స్వేచ్చా స్వాతంత్రాలు చాలా తక్కువే.  కనీసం బయటకు వెళ్ళడానికి కూడా కుటుంబ సభ్యుడైన పురుషుడితో వెళ్ళాల్సిందే. ఇక ప్రపంచంలో స్త్రీలు అనేక విభాగాలలో పోటీ చేస్తున్నారు. ఆఫ్ఘన్ నుండి కూడా చాలా విభాగాలలో మహిళా టీం లు ఉన్నాయి. వాటిని ఆడానివ్వబోయేది లేదని తాలిబన్లు స్పస్టం చేసినప్పటికీ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కల్పించుకోవడంతో కాస్త వెనక్కి తగ్గరు. కానీ, మహిళా ఫుట్ బాల్ టీం వరకు వచ్చేసరికి మళ్ళీ మొదటికే వచ్చారు. దీనితో వాళ్ళకు ప్రాణభయం ఉన్నదని తెలుసుకున్న మహిళా టీం దొడ్డిదారిన పాక్ కు చేరుకుంది. పాక్ వీరికి ఆశ్రయం ఇచ్చింది. వీరు జట్టు సభ్యులు కుటుంబ సభ్యులతో సహా పాక్ చేరుకున్నారు.
నిజానికి వీళ్ళు 32 మంది ఖతార్ చేరాల్సి ఉండగా, కాబూల్ విమానాశ్రయం తాలిబన్ల హస్తగతం కావడంతో వేరే దారిలేక పాక్ కు చేరారు. బ్రిటన్ కు చెందిన ఒక ఎన్.జి.ఓ. సాయంతో పాక్ వీరికి అత్యవసర వీసా ఏర్పాట్లు చేసింది. అయితే తాలిబన్ల తోక దేశానికి వీళ్ళు చేరుకోవడం వెనుక కూడా వారి ప్రణాళిక ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఒక్కసారి వారు పాక్ చేరిన తరువాత అక్కడ నుండి ఖతార్ చేరుకొనున్నారు. అయితే వీరు ఆడి వచ్చిన తరువాత ఎక్కడ ఉండనున్నారు అనేది ప్రశ్న. కుటుంబాలతో సహా పాక్ చేరుకున్నారు కాబట్టి ఇక అక్కడే ఉండనున్నారా లేక మరోసారి నివాసస్తలం మార్చుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: