ఐపీఎల్ : అత్యధిక మ్యాచ్ లు ఆడిన వీరులు వీరే?

praveen
మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2 దశ ప్రారంభం కాబోతుంది.  అనుకున్న సమయానికి భారత్ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ ఎంతో సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో చివరికి ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత గతంలో లాగానే మళ్లీ యూఏఈ వేదికగా మిగిలి ఉన్న ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ. ఇప్పటికే యూఏఈలో ఐపీఎల్ రెండు దశకి సంబంధించి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అటు అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లు కూడా యూఏఈ చేరుకొని ఆరు రోజుల క్వారంటైన్ లో గడుపుతున్నారు.

 ఇక సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి ఐపీఎల్ రెండో దశ మళ్లీ ప్రారంభం కాబోతుంది. ఇక మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతోంది.  ఇక ఈ మ్యాచ్ పై కూడా అటు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే అటు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కువగా మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు ఎవరు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన వీరు ఎవరో తెలుసుకునేందుకు అటు ఎంతో మంది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఐపీఎల్ 2008లో ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఒక్క సీజన్ కే ఎక్కువ క్రేజ్ సంపాదించింది.

 ఇప్పటివరకు ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే 2008లో ప్రారంభం అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్లలో భారత ఆటగాళ్లే ముందున్నారు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా..  ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు టైటిల్ గెలిచిన మిస్టర్ కూల్  సారథిగా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల లో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. 5సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన రోహిత్ శర్మ రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఎంఎస్ ధోని ఇప్పటివరకు ఐపీఎల్లో 211 మ్యాచ్లు ఆడాడు. రోహిత్ శర్మ 207 మ్యాచ్లు ఆడాడు. దినేష్ కార్తీక్ 203.. సురేష్ రైనా 200, విరాట్ కోహ్లీ 199వ మ్యాచ్ లను ఇప్పటివరకు ఐపీఎల్లో ఆడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: