ప్రముఖ క్రికెటర్లను దాటేసిన నీరజ్‌ చోప్రా..!

Veldandi Saikiran
మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో... మన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. జావెలిన్ త్రో విభాగం లో లో అతి లైట్ నీరజ్ చోప్రా ఇండియాకు... సరికొత్త పథకాన్ని సాధించి పెట్టాడు. ఇక టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన అనంతరం... నీరజ్ చోప్రా క్రేజ్ మరింతగా పెరిగింది. ఎంతలా అంటే... ఎక్కడ చూసినా నీరజ్ చోప్రా మాటే. ఇక ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో  ఓ రేంజ్ కు ఎదిగాడు. 

నీరజ్ చోప్రా ఒలంపిక్ గోల్డ్ పతకాన్ని గెలిచిన రోజు నుంచి... ఇప్పటివరకు అటు సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియా లో ఒక హవా కొనసాగిస్తున్నాడు. గోల్డ్ మెడల్ సాధించడం ఏమోగానీ.. పెద్ద సెలబ్రిటీ అయ్యాడు నీరజ్ చోప్రా. ఈ నేపథ్యంలోనే పలు రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు నీరజ్ చోప్రా. తాజాగా రీసెర్చ్ కన్సల్టెన్సీ యు స్పోర్ట్స్ సంస్థ ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా ఇంస్టాగ్రామ్ లో వరల్డ్ వైడ్ గా మోస్ట్ మెన్షన్ పర్సన్ గా నీరజ్ చోప్రా రికార్డులను సృష్టించారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో సుమారు 2.9 మిలియన్ల యూజర్లు నీరజ్ చోప్రా గురించి మాట్లాడటం గమనార్హం.

అటు డిజిటల్ మీడియా విభాగంలోనూ సరికొత్త రికార్డును సృష్టించాడు. డిజిటల్ మీడియాలో 2055 నీరజ్ చోప్రా గురించే మాట్లాడుకున్నారట. దీని కారణంగా  నీరజ్ చోప్రా... సోషల్ మీడియా వేషం ఏకంగా 420 కోట్లకు చేరుకుందట. ఇక నీరజ్ చోప్రా ప్రస్తుతం సోషల్ మీడియా ఇంటరాక్షన్ లోనూ క్రికెటర్లు కేబుల్ రాహుల్ మరియు రిషబ్ పంత్ లను ఓవర్టేక్ చేశాడట. ప్రస్తుతం 4.4 మిలియన్ల ఫాలోవర్స్ లను ఇంస్టాగ్రామ్ లో కలిగి ఉన్నాడు నీరజ్ చోప్రా. అలాగే ఫాలోవర్స్ లలో 2297 శాతం మేర పెరుగుదల సాధించాడు నీరజ్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: