టి20 వరల్డ్ కప్.. సెమీ ఫైనల్ వెళ్లే జట్లు ఇవేనట?

praveen
క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ  టీ20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే దీనికోసం అన్ని దేశాల జట్లు కూడా సంసిద్ధం అయిపోతున్నాయి.  ఈసారి ఎట్టిపరిస్థితిలో వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి  ఈ క్రమంలోనే ఈ పోరును వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధమవుతున్నారు. కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు  ఐసీసీ ఈవెంట్ పై స్పందిస్తున్నారు  టోర్నీ విజేత గా ఎవరు నిలువ పోతున్నారు అనే దాని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

 అంతేకాదు తమ ఫేవరెట్ జట్లు ఏవి అన్న విషయాన్ని కూడా ప్రకటిస్తున్నారు..  ఈ క్రమంలోనే అటు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అటు టీమిండియా ప్రదర్శనపై ఎప్పుడు రివ్యూలు ఇచ్చే ఆకాష్ చోప్రా మరో సారి ఇక మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ గురించి కూడా స్పందించాడు  ఇటీవలే సోషల్ మీడియాలో ఆస్క్ ఆకాష్ పేరిట అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ గురించి అటు అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మీ అంచనా ప్రకారం టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్కు చేరే నాలుగు చెట్లు ఏవి అని ప్రశ్నించగా.. టీమ్ ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్,  వెస్టిండీస్ జట్లు టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కు వెళ్తాయి అంటూ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు

 అంతేకాకుండా స్పిన్ విభాగంలో ఎవరికీ చోటు దక్కుతుంది అని ప్రశ్నించగా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తున్న జడేజా అశ్విన్ లకు చోటు దక్కుతుందని.. అంతేకాకుండా చాహర్ లేదా వరుణ్ లకు చోటు దక్కుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియాకు మెంటార్ గా ఎంపికైన ధోని గురించి రెండు పదాల్లో వర్ణించమని ఒక నెటిజన్ అడగగా.. ధోని జీనియస్ లెజెండ్ అంటూ సమాధానం చెప్పాడు ఆకాశ్ చోప్రా. కాగా అక్టోబర్ 17 నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: