ఐపీఎల్ తో మాకు భలే లాభం : బంగ్లాదేశ్ క్రికెట్

praveen
మరికొన్ని రోజుల్లో ఐపిఎల్ స్టార్ట్ కాబోతుంది. సెప్టెంబర్ 19 నుంచి మళ్ళీ ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ మొదలు కాబోతుంది. అయితే ఈసారి భారత్ వేదికగా కాకుండా యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండవ దశ జరగబోతుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఆటంకం రాకుండా ప్రశాంతంగా టోర్నీ జరిగే విధంగా బిసిసిఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది  ప్రస్తుతం అన్ని జట్ల ఆటగాళ్లు కూడా యూఏఈ చేరుకొని ఆరు రోజులు క్వారంటైన్ లో గడుపుతున్నారు. ఇక ఏకంగా ఫామిలీ తో సహా ఎంతో సరదాగా క్వారంటైన్ ని ఎంజాయ్ చేస్తున్నారు క్రికెటర్లు.  ప్రస్తుతం విదేశీ క్రికెటర్లు సైతం యూఏఈ చేరుకొని క్వారంటైన్ లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే అటు విదేశీ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు.  ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అతిపెద్ద దేశీయ లీక్ కావడం గమనార్హం. ఇక ఈ లీగ్ లో ఆడితే ఎన్నో అనుభవాలను సంపాదించవచ్చు అని విదేశీ క్రికెటర్లు కూడా భావిస్తూ ఉంటారు.  ఇప్పటికే ఈ విషయాన్ని అటు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ ఉల్ హాసన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ అనుభవాలను తమ దేశ క్రికెటర్లు అందరితో కూడా పంచుకుంటాను అని తెలిపాడు. మరోసారి ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరుగుతున్న ఐపీఎల్ తో తమ జట్టుకు ఎంతో లాభం చేకూరుతుంది అంటూ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్  అన్నాడు. వరల్డ్ కప్ కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. జట్టులోని ప్రతి ఒక్కరికి కూడా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడటం వల్ల బంగ్లాదేశ్ జట్టుకే ఎక్కువగా లాభం ఉంది అంటూ తెలిపాడు. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ కి ముందే ఐపీఎల్ ఆడటం వల్ల యూఏఈ లోని  పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని.. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ లో యూఏఈలో బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్లు ఆడటం ఎంతో కలిసొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: