అలా జరగడం ఎంతో దురదృష్టకరం : కోహ్లీ

praveen
మొన్నటివరకు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో హడావిడిగా యూఏఈ వచ్చారు. ఐపీఎల్ లోని ఆయా జట్ల ప్రాంఛైజీలు తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటుచేసి యూఏఈ తీసుకువచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ముంగిట  ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అనుకున్న ఇంగ్లాండ్ తో 5వ టెస్ట్ మ్యాచ్ రద్దు కావడం మాత్రం ఒక వైపు అభిమానులను మరోవైపు ఆటగాళ్లను కూడా ఎంతగానో నిరాశపరిచింది అని చెప్పాలి. ఇక ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు కావడం పై అటు  ఇంగ్లాండ్ క్రికెటర్లతో పాటు భారత క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 ముఖ్యంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు అయితే..  ఐపీఎల్ కోసమే బిసిసిఐ ప్లాన్ ప్రకారమే 5వ టెస్ట్ మ్యాచ్ రద్దు అయ్యేలా చేసింది అంటూ ఎన్నో హాట్ హాట్ కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా ఇలాంటి సమయంలో ఇటీవలే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ రద్దు కావడం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్ పర్యటన నుంచి యూఏఈ కి ఇంత త్వరగా రావడం ఎంతో దురదృష్టకరం అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.  తమ జట్టు బృందంలో కొంతమందికి కరోనా వైరస్ రావడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు.

 ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్ లో నైనా బయో బబుల్ ఎంతో సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నాను అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు.  సురక్షితమైన నాణ్యమైన టోర్నీ చూస్తామని ఆశిస్తున్నాను అంటూ విరాట్ కోహ్లి తెలిపాడు. కాగా ఇటీవలే ఇంగ్లాండ్  పర్యటనలో ఉన్న సిరాజ్, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లను ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం యూఏఈ తీసుకువచ్చింది. కాగా ఈ నెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఈ నెల 20వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. కోల్కతా జట్టు తో మ్యాచ్ ఆడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: