పాకిస్థాన్ క్రికెట్ లో సంచలన మార్పులు !

Veldandi Saikiran
మరో నెల రోజుల్లో టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ టి20 ప్రపంచ కప్ నేపథ్యంలో అన్ని జట్లు కసరత్తులు మొదలు పెట్టాయి.   అలాగే ఒక్కొక్క జట్లు తమ టీం లను కూడా ప్రకటిస్తున్నాయి. ఇక టీమిండియా మరియు  ఇతర కీలక జట్లు అన్ని తమ తమ ఆటగాళ్ల లిస్టు ను వెలువరించాయి.  ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ క్రికెట్ లో ఓ కీలక పరిణామం జరిగింది. తాత్కాలిక పోస్టులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇద్దరూ విదేశీ దిగ్గజాలకు చాన్స్ ఇచ్చింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాత్యూ హెడెన్ ను... హెడ్ కోచ్ గా నియామకం చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. అంతేకాదు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ వర్ణన్  ఫిలందర్ ను బౌలింగ్ హెడ్ కోచ్ గా నియామకం చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. 

వరల్డ్ క్రికెట్ హిస్టరీ లో విధ్వంస కర బ్యాట్స్మెన్ లలో ఒకడైన మాథ్యూ హెడెన్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియామకం చేయడం సంచలనంగా మారింది. ఇక మ్యాత్యూ హెడెన్ ఆస్ట్రేలియా తరపున... 103 టెస్టులు, 161 వన్డేలు మరియు 9 టీ20 మ్యాచ్ లు అడాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న రమీజ్ రాజా... తన మొదటి బోర్డు సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

ఇక ఇది ఇలా ఉండగా టీ-20 జట్టు ను ప్రకటించిన నాటి నుంచి పాకిస్తాన్ క్రికెట్ లో కాస్త అలజడి మొదలైన సంగతి విధితమే. తమ ఒపీనియన్ కు వాల్యూ లేదని... అసలు తమను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదంటూ... పాకిస్తాన్ ఆన్ ది హెడ్ కోచ్ మిస్బా మరియు బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేశారు.  బాగా అ టి 20 గ్రూప్ టు లో భాగంగా వచ్చే నెల 24వ తారీఖున ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయిలో జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: