కోహ్లీ కాదు రోహిత్ కెప్టెన్.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ?

praveen
పరిమిత ఓవర్ల క్రికెట్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సక్సెస్ సాధించలేకపోతూ ఉండడం అంతే కాకుండా ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఐసీసీ ఈవెంట్లు ఆడినప్పటికీ ఒకసారి కూడా కూడా భారత్ కు కెప్టన్ కోహ్లీ  వరల్డ్ కప్ అందించకపోవడంతో కోహ్లీ కెప్టెన్సీపై గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు కూడా ఎక్కువైపోతున్నాయి. రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల టీమిండియా జట్టు బాధ్యతలు అప్పగిస్తే టీమిండియా మరింత విజయవంతంగా ముందుకు దూసుకు పోతుంది అని ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు కూడా పెట్టారు అన్న విషయం తెలిసిందే.

 అయితే అటు ఇక ఈ రూమర్లపై బిసిసిఐ కూడా పలుమార్లు స్పందించింది. టీమిండియాకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతాడని.. ఇప్పట్లో కెప్టెన్సీ మార్పు చేసే ఆలోచన లేదు అంటూ స్పష్టం చేసింది. మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే టి20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్కు కెప్టెన్గా తప్పుకోనున్నాడని ఇక బిసిసిఐ కూడా రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది అనే టాక్ వినిపించింది. అయితే ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక ఈ తాజాగా ఈ వార్తలపై స్పందించిన బీసీసీఐ పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చింది. రోహిత్ శర్మకు వన్డే టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు అంటూ వస్తున్న వార్తలను ఖండించింది బీసీసీఐ. అసలు కెప్టెన్సీ మార్పు గురించి బిసిసిఐ ఇప్పటివరకు చర్చించలేదు టెస్టులు వన్డేలు టీ20 లకు విరాట్ కోహ్లీ నే సారథిగా కొనసాగుతాడు అంటూ బిసిసిఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.  ఇలా గత రెండు మూడు రోజుల నుంచి టి20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకొని రోహిత్కు అప్పగిస్తాడని.. బ్యాటింగ్ పై దృష్టి పెట్టేందుకు  ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు బిసిసిఐ క్లారిటీ ఇవ్వడంతో చెక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: