పాకిస్థాన్ కోచ్ గా లెజెండరీ క్రికెటర్?

praveen
సాధారణంగా ప్రతి క్రీడాకారుడు విజయం వెనుక ఒక కోచ్ తప్పనిసరిగా ఉంటాడు. కోచ్ ఎంతో కష్టపడి క్రీడాకారిని రాటుదేలిన చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అందుకే కొంత మంది క్రీడాకారులు విజయం సాధించిన తరువాత ఏకంగా కోచ్ లకు ఆ విజయాన్ని అంకితం ఇవ్వడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. అయితే అటు క్రికెట్ జట్టులో కూడా కోచ్ ఎంతో కీలకం అని చెప్పాలి. జట్టుకు కోచ్ సరిగా లేడు అంటే ఇక జట్టు బాగా రాణించడం కూడా చాలా కష్టమే.. జట్టు ప్రదర్శన.. ఆటగాళ్ళ మధ్య సమన్వయం కూడా పూర్తిగా కోచ్ మీదే ఆధారపడి ఉంటుంది.

 ఇక దిగ్గజ క్రికెటర్ గా ఉన్న వ్యక్తి కోచ్ గా వస్తే ఇక అంతకంటే ఇంకేం కావాలి. ఆ జట్టుకు తిరుగు ఉండదు అని చెప్పాలి.  ఇక ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇలాంటి ఒక లెజెండరీ క్రికెటర్ కోచ్ గా రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ లో గత కొన్ని రోజుల నుంచి ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి.  ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కి కొత్త చైర్మన్ కూడా రావడం గమనార్హం. ఇక ఇటీవలే క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ను కూడా ఎంపిక చేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

 ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ బ్యాట్స్మెన్ క్రికెట్ లో లెజెండ్ గా కొనసాగుతున్న ఆటగాడు మాథ్యూ హెడెన్  పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. టి20 వరల్డ్ కప్ కు పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా మాజీ బౌలర్ వెర్నన్ ఫిలాండర్ పాకిస్థాన్ జట్టు బౌలింగ్ కోచ్గా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న విభేదాల నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ కూడా పదవికి రాజీనామా చేయడంతో ఇక కొత్త కోచ్ లను ఎంపిక చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: