ఐసీసీ అరుదైన అవార్డు.. కుక్కకు అంకితం?

praveen
ఐసీసీ ప్రతి నెల అటు క్రికెట్లో బాగా రాణించిన ఆటగాళ్లకు.. మంచి విజయాలు సాధించిన జట్లకు మంత్లీ అవార్డులు ప్రకటిస్తూ ఉండటం లాంటివి జరుగుతూ ఉంటుంది.  ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇటీవలే మరోసారి ఐసీసీ మంత్లీ అవార్డులను ప్రకటించింది. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఐసీసీ ప్రకటించిన ఈ అవార్డ్స్ కాస్త ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ఐసిసి మంత్లీ అవార్డ్స్ లో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అవార్డు కూడా చేరి పోవడం గమనార్హం.

 ఇక ఇటీవలే మంత్లీ అవార్డ్స్ లో భాగంగా ఐసీసీ అవార్డు ఇచ్చింది ఏ క్రికెటర్ కో అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ఐసీసీ అవార్డు ఇచ్చింది ఏకంగా ఒక కుక్కకు    . ఏంటి ఆశ్చర్య పోయారు కదా కానీ ఇది నిజమే. ఏకంగా ఒక కుక్క కి స్పెషల్ అవార్డు పేరుతో ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్ ఒక ప్రత్యేకమైన అవార్డు ఇచ్చింది. అంతేకాదు ఒక స్పెషల్ వీడియోను కూడా పోస్ట్ చేసింది ఐసీసీ. ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అంటారా..  ఇటీవల జరిగిన  డాజ్లింగ్ మ్యాచ్లో ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏకంగా యజమాని నుంచి విడిపించుకుని ఒక కుక్క మైదానంలోకి పరుగులు పెడుతూ వచ్చింది.

 ఈ క్రమంలోనే ఏకంగా మైదానంలో దూసుకుపోతున్న బంతిని నోటితో పట్టుకుని మైదానం మొత్తం పరుగులు పెట్టింది. అటు మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న వారు కూడా కుక్కను పట్టుకునేందుకు దాని వెంట పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను ఊపేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ డాగ్ చేసిన పని అటు ఐసీసీ ని కూడా ఆకర్షించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ ప్రకటించిన అవార్డ్స్ లో కుక్కకు ఒక అవార్డు ప్రకటించింది. ఆగస్టు నెల కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ప్రస్తుతం ఈ డాగ్ నిలిచింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: