కెప్టెన్సీ నెక్స్ట్... బ్యాటింగ్ ఫస్ట్, కెప్టెన్ గా కోహ్లీ రాజీనామా???

Yalamanchili Swathi
భారత క్రికెట్ జట్టులో పెను మార్పులు మనం చూడబోతున్నామా??? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఏంటీ అంటే కెప్టెన్ కోహ్లీని ఆ పదవి నుంచి పక్కన పెడుతున్నారట. అంటే అన్ని ఫార్మాట్స్ నుంచి కాదు, కేవలం పొట్టి ఫార్మాట్ కు మాత్రమే బ్యాటింగ్ మెషిన్ ని పక్కన పెడుతుంది యాజమాన్యం. కారణాలు ఏంటీ??? అసలు ఎవరు పుకారు పుట్టించారు??? అందులో నిజం ఎంతో మనం తెలుసుకుందాం. టీ 20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీని తనకు నాయకత్వ బాధ్యతలు వద్దని నిర్ణయం తీసుకుంటే ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తుంది బోర్డు.
ఆ స్థానానికి ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అంటే, ఐపిఎల్ టోర్నీలో తన జట్టుని విజయపథం లో నడిపించే ఓపెనర్ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగిస్తారు. కోహ్లీపై ఒత్తిడి ఉందనే మాట మనం ఎప్పటి నుంచో సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. అందుకే బ్యాటింగ్ లో పదును తగ్గిపోయిందని ఫ్యాన్స్  కూడా విలపించే పరిస్థితి ఏర్పడింది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా కూడా కోహ్లీ సమర్ధవంతంగా లేరనే ఆరోపణ కూడా ఉంది. గత ఏడాది నుంచి బ్యాటింగ్ మెషిన్ ప్రదర్శన తీసికట్టుగా మారుతోంది.
అందుకే ఇక లాభం లేదని భావించి కోహ్లీని హర్ట్ చేయకుండా అతని ముందే ఒక ఆప్షన్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కోహ్లీ ఇప్పటివరకు 95 వన్డేల్లో భారత్‌ కు నాయకత్వం వహించాడు. అందులో 65  విజయాలు ఉండగా 27 పరాజయాలు ఉన్నాయి. 70.43 విజయ శాతాన్ని నమోదు చేసాడు. అలాగే  అతను కెప్టెన్‌ గా ఉన్న 45 టీ 20 ల్లో, టీం 27 సార్లు గెలిచి, 14 సార్లు ఓడిపోయింది. ఒకవేళ తప్పుకునే ఆలోచన ఉంటే కోహ్లీ నుంచి స్వయంగా ప్రకటన వస్తుందని నేషనల్ మీడియాకు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కోహ్లీ డెసిషన్ త్వరలో తెలిసే సూచన ఉందన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: