ఫ్యాన్స్ ని తలచుకుంటేనే బాధేస్తోంది : స్టార్ బౌలర్

praveen
భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇటీవలే ఐదు టెస్టుల సిరీస్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.  ఇక ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ ఎంతో హోరాహోరీగా జరిగింది. ఇక మొదటి టెస్టు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారగా.. చివరికి ప్రేక్షకులందరికీ నిరాశ మిగిలింది. ఎందుకంటే వర్షం కారణంగా మొదటి టెస్టు మ్యాచ్ రద్దు అయ్యింది. ఇక ఆ తర్వాత జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా జట్టు అద్భుతంగా రాణించి అనూహ్యమైన విజయాన్ని సాధించింది.

 ఇక మూడో మ్యాచ్ లో కూడా టీమిండియా గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ ఓటమి పాలయింది. ఆ తర్వాత జరిగిన నాలుగవ మ్యాచ్ లో విజయం సాధించి ఆతిథ్య ఇంగ్లాండ్ పై ఆధిపత్యం సాధించింది.  ఇకపోతే 5 వ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఎంతో ఉత్కంఠగా మారింది. చివరికి కరోనా వైరస్ కారణంగా మ్యాచ్ రద్దు అయ్యింది.  అయితే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ కి అటు ప్రేక్షకులను కూడా అనుమతించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే ఉత్కంఠభరితమైన ఐదో మ్యాచ్ వీక్షించేందుకు కొన్ని రోజుల ముందే క్రికెట్ ప్రేక్షకులందరూ టికెట్లు బుక్ చేసుకున్నారు.

 చివరికి కరోనా వైరస్ కారణంగా 5 టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో ప్రేక్షకులందరికీ నిరాశే మిగిలింది. ఇటీవలే ఇదే విషయంపై ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ రద్దు కావడం ఎంతో అసంతృప్తిగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ కోసం టికెట్లు కొని బస ఏర్పాటు చేసుకొని ప్రయాణించి వచ్చిన అభిమానులు ఎంతో మంది వున్నారు అంటూ వ్యాఖ్యానించాడు. సిరీస్ లో మంచి ముగింపు కోసం ఎదురు చూసిన ప్రేక్షకులను తలచుకుంటే ఎంతో బాధగా ఉంది. నేను ఎంతో ఇష్టపడే నా సొంత మైదానంలో ఏదో ఒకసారి మళ్ళీ ఇదే మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నాను అంటూ జేమ్స్ అండర్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: