ఐపీఎల్ గురించి మా వాళ్లకు కూడా చెబుతా : స్టార్ క్రికెటర్

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ మజా పంచుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కేవలం క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఆటగాళ్లు సైతం ఐపీఎల్ ద్వారా ఎన్నో అనుభవాలను నేర్చుకుంటూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే వివిధ దేశాలలో నిర్వహించే క్రికెట్ లీగ్ లలో ఆడటం కంటే ఐపీఎల్లో ఆడదానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

 ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే  ఐపీఎల్లో ఆడటానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇలా ఐపీఎల్ అంటేనే ఓ వైపు స్వదేశీ ఆటగాళ్లు మరోవైపు విదేశీ ఆటగాళ్లు కలిసి ఆడటం. ఒకే జట్టులో ఆడిన ఆటగాళ్లు ప్రత్యర్థులుగా మారిపోతే.. ప్రత్యర్థులుగా ఆడిన ఆటగాళ్లు ఒకే జట్టుగా మారిపోయి  క్రికెట్ ఆడుతూ ఉంటారు. దీంతో ఆటగాళ్లకు కూడా మైదానంలో ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా ఎన్నో  మెలుకువలు ఎంతో అనుభవం సాధించామని  పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరో స్టార్ క్రికెటర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పొందిన అనుభవాలు అన్నింటినీ కూడా తమ దేశ ఆటగాళ్లతో పంచుకుంటాను అంటూ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు. ఇలా చేయడం ద్వారా తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ ప్రతి ఒక్క ఆటగాడికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నా అంటూ తెలిపాడు. ఇక టి20 వరల్డ్ కప్ గురించి మిగతా ఆటగాళ్లు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే విషయాలను కూడా తమ దేశ ఆటగాళ్లతో చెబుతాను అంటూ షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు. కాగా షకీబ్ అల్ హసన్  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా జట్టు తరఫున ఆడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: