టెన్నిస్ చరిత్రలో సంచలనం.. కొత్త రికార్డు?

praveen
బరిలోకి దిగిన ప్రతి క్రీడాకారుడు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు  ఎంతో కసిగా ఆడుతూ ప్రపంచం చూపు మొత్తం తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా ప్రతి  ఆటలో ప్రతి ఒక్కరూ ఛాంపియన్ అవ్వాలి అనే కlతోనే బరిలోకి దిగుతున్నారు  కానీ కొంతమందికి మాత్రం తక్కువ సమయంలోనే ఈ కల నెరవేరుతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇటీవలే టెన్నిస్ చరిత్రలో ఒక పెద్ద సంచలనమే చోటుచేసుకుంది. ఏకంగా ఒక 18 ఏళ్ల యువతి యూఎస్ ఓపెన్ ఫైనల్లో విజేతగా ఆవిర్భవించింది ప్రపంచం చూపును ఆకర్షించింది.

 ప్రస్తుతం ఇక ఆ 18 ఏళ్ల యువతి ప్రతిభకు ప్రపంచం మొత్తం ఫిదా అవుతుంది అని చెప్పాలి. ఏకంగా 18 ఏళ్ల ఎమ్మా రేడుకాను  బ్రిటిష్ టెన్నిస్ సంచలనం 19 ఏళ్ల కెనడా ప్లేయర్ లేలా ఫెర్నాండేజ్ ను ఓడించి ఇక సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఏకంగా 6 -4, 6-3 తేడాతో ఓడించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఎమ్మా రేడుకాను. న్యూయార్క్ లోని కరోనా పార్క్ ఆర్థర్ ఆష్  స్టేడియం లో యూఎస్ ఓపెన్ 2021 మహిళల ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో పోరూ హోరాహోరీగానే జరిగింది  అయితే టీనేజర్ ఎమ్మా రేడుకాను మొదటినుంచీ మ్యాచ్ ఫై పట్టు సాధిస్తూ వచ్చింది. ఒక్క సెట్ లో కూడా ఓడిపోకుండా సత్తా చాటింది. ఏకంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఒక అద్భుతమైన గెలుపు ను తన ఖాతాలో వేసుకుంది.

 అతి చిన్న వయసులోనే గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుని గ్రాండ్ విక్టరీ కొట్టింది ఎమ్మా రేడుకాను. ఇక తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుని ఆనందంలో మునిగిపోయింది. అయితే గతంలో మరియా షరపోవా పదిహేడేళ్ల వయసులోనే వింబుల్డన్ విజేతగా 2004 సంవత్సరం లో నిలిచింది. ఇక ఆ తర్వాత యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లో ఈ రికార్డు సాధించిన టీనేజర్ గా గుర్తింపు సంపాదించింది ఎమ్మా రేడుకాను. అయితే ఈ క్రీడాకారిణి కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏమీ లేవు అని చెప్పాలి   ఇలా ఇప్పటి వరకు ఎక్కడా తెర మీద అంతగా కనిపించని ఎమ్మా రేడుకాను.. ఒక్కసారిగా గ్రాండ్ స్లామ్  టైటిల్ గెలవడంతో మాత్రం ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: