ఐపీఎల్ బ‌హిష్క‌రిస్తామంటున్న ఆట‌గాళ్లు.. ఎందుకో తెలుసా..?

Paloji Vinay
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ అనూహ్యంగా ర‌ద్ధ‌యింది. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో 2-1 తేడాతో భార‌త్ ముందు ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్‌ ఆటగాళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారని స‌మాచారం. తమ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశముంద‌ని కానీ టీమిండియా ఆట‌గాళ్లు కరోనా బూచి కార‌ణం చూపించి కావాలనే 5వ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారని ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఆరోపిస్తున్నారు.

     కొత్తగా కొవిడ్‌ కేసులు నమోదవుతాయని భయపడిన టీమిండియా క్రికెటర్లు మాంచెస్టర్‌ వీధుల్లో తిరగడమేంటని ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం ఐపీఎల్ లో పాల్గొనేందుకు టెస్ట్‌ మ్యాచ్ ఆడ‌లేద‌ని ఆరోపించారు. ఇంతటితో ఆగని ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు  యూఏఈలో జ‌ర‌గ‌బోతున్న రెండ‌వ భాగం మ్యాచ్‌ల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదివ‌ర‌కే ఈ ఐపీఎల్‌ బహిష్కరణ విష‌య‌మై ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, క్రిస్‌ వోక్స్ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్‌ మీడియా కథనాలు సైతం ప్రచారం చేస్తూ వ‌స్తోంది. ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఐదుగురు ఇంగ్లాండ్‌ క్రికెటర్లలో ఒకరు మిగ‌తా ఆటగాళ్లను రెచ్చగొట్టారని సమాచారం.


    ఇదిలా ఉండ‌గా, భారత క్రికెట్ బృందంలో కొవిడ్ కేసు వెలుగు చూడటంతో టెస్ట్ మ్యాచ్‌కు మూడు గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). భారత కోచింగ్‌ సిబ్బంది వరుసగా క‌రోనా భారిన పడడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సుదీర్ఘ చర్చల అనంతరం ఇంగ్లండ్ అండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ర‌ద్దుతో సొంతగడ్డపై సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు ఐపీఎల్‌ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగారని తెలుస్తోంది. అయితే, ఈ సిరీస్ ఫ‌లితాల పై ఐసీసీ ఇంకా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించలేదు. మ‌రోక‌వైపు ఐపీఎల్ ఆడ‌డానికి భార‌త్ క్రికెట‌ర్లు యూఏకీ చేరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: