ఆ ఇద్దరి బ్యాటింగ్ అస్సలు మర్చిపోలేను : సెహ్వాగ్

praveen
ఇటీవలే టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఐదు టెస్టుల సిరీస్ లో కరోనా వైరస్ కారణంగా ఎటూ కాకుండానే సిరీస్  రద్దు అయ్యే  పరిస్థితి వచ్చింది.  మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఇక రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు విజయం సాధించింది. మూడవ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తుంది అనుకున్నప్పటికీ  పేలవా ప్రదర్శనతో టీమిండియా ఓటమి పాలయింది. ఇక ఆ తర్వాత జరిగిన నాలుగవ మ్యాచ్ లో  అనూహ్యంగా పుంజుకుని టీమిండియా జట్టు విజయం సాధించి ఏకంగా ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం సాధించింది.

 ఈ క్రమంలోనే ఐదవ టెస్టు మ్యాచ్ లో ఎవరు గెలవ బోతున్నారు అన్నదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఎవరు సిరీస్ కైవసం చేసుకుంటారు అన్నదానిపై కూడా ప్రేక్షకులు అందరిలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇలాంటి సమయంలో.. టీమిండియా లో కరోనా  వెలుగులోకి రావడంతో చివరికి ఇక ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటున్నారు.కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా అటు రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్ అద్భుతంగా రాణించారు. ఎంతో నిలకడగా రాణిస్తూ జట్టుకు మంచి స్కోరు అందించడంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి.

 ఇటీవలే వీరిద్దరూ ఆటతీరుపై టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్ అద్భుతంగా ఆడారు అంటూ చెప్పుకొచ్చారు వీరేంద్ర సెహ్వాగ్. ఇక వారి బ్యాటింగ్ అసలు తాను మరచి పోలేను అంటూ చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వాళ్ళిద్దరూ రాణించక పోతే  ఆయా టెస్టులో టీమిండియా బాగా పరుగులు చేసేది కాదని త్వరగా అవుట్ అయ్యేది అంటూ చెప్పుకొచ్చారు వీరేంద్ర సెహ్వాగ్   వాళ్ళిద్దరు సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోతే మిడిలార్డర్ బ్యాట్స్మెన్ త్వరగా క్రీజు లోకి వచ్చేవారు..  దీంతో టీమిండియా తక్కువ పరుగులకే త్వరగా అవుట్ అయ్యేది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: