తాలిబన్ .. క్రికెట్ టీం .. !

Chandrasekhar Reddy
తాజాగా ఏర్పడిన దేశం(తాలిబన్ ఆఫ్ఘన్) లో మహిళల స్వేచ్చకు కాలం చెల్లినట్టే అని అందరికి తెలిసింది. ఇప్పటికే వారిపై అనేక ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా గత తాలిబన్ ప్రభుత్వం లో ఉన్న నిబంధనలు అన్ని ఇప్పుడూ ఉంటాయని వారు చెప్పకనే చెపుతున్నారు. అంటే మహిళలు ఉద్యోగాలు చేయరాదు, చదవరాదు, బయటకు రారాదు, వచ్చినా మగవారితో అదికూడా ఇంట్లోని మగవారితో మాత్రమే రావాలి, పార్టీలు గట్రా చేసుకోరాదు, వేరే వారి పార్టీకి వెళ్లినా అక్కడ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో కాకుండా అన్యులతో సంబాషించరాదు..ఇలా అన్ని నియమాలు పాటించాల్సిందే.
కనీసం ఇంట్లో ఉన్నా కూడా గత ప్రభుత్వం ప్రకారం టీవీ కూడా చూడరాదు. ఇలాంటి దేశంలో మహిళా క్రికెట్ టీం అంటే నిజంగా విచిత్రం గానే ఉంటుంది. కానీ, దేశం ఏర్పాటు చేయగానే మహిళల పరిస్థితి ఊహించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మహిళా క్రికెట్ టీం ను ఆడనిస్తేనే భవిష్యత్తులో తమతో క్రికెట్ మ్యాచ్ ఆడతామని హెచ్చరించింది. దీనికి మొదట లొంగకపోయినా, తాజాగా మహిళల టీం తాలిబన్ ఆఫ్ఘన్ నుండి ఉంటుందని చెప్పడంలో వారి ప్రణాళికలు ఏమై ఉండనున్నాయో వేచి చూడాలి.
అసలు కాస్త స్వేచ్ఛ కూడా ఇవ్వని వారు ఏకంగా క్రికెట్ టీం అంటే, దీనిని నిశ్చితంగా పరిశీలిస్తున్న ప్రపంచం ముందు తాను మారినట్టు చెప్పడానికే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్పు ప్రపంచం కోసం మాత్రమే అయితే తాలిబన్ లు ఇంకా రక్తపిపాసులుగా ఉన్నట్టే లేదా కొంత కాలం నటించి ఆ తరువాత విజృంభించేందుకు అయినా అయిఉండవచ్చు. ఏది ఏమైనా రాక్షసులు మారతారేమో అని ఎదురు చూడటం తెలివితక్కువ పనే అవుతుంది. ఒకవేళ ప్రపంచ టి20 కప్ కోసం వారు ఒప్పుకున్నారు అనుకున్నా కూడా ప్రతి వారిని మానవ బాంబులుగా ప్రపంచం మీదకి వదలకుండా ఉంటె అంతే చాలు. ప్రపంచం స్వాగతిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలను తాలిబన్ లు తమ ఆయుధాలుగా చేసుకుంటే పరిస్థితి ఏమిటి అనే కోణాన్ని కూడా పరిశీలన లోకి తీసుకోవాల్సిందే. దాదాపు ఈ ఉద్దేశ్యం తోనే చాలా మంది ఆఫ్ఘన్ లు తమ పిల్లలను విదేశాలకు తరలించేశారు. అమెరికా కూడా అలా ఆయా దేశాలు చేరిన ఆఫ్ఘన్ పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చే వరకు జాగర్తగా చూసుకోవాలని కోరింది. లేదంటే వారిని తాలిబన్ లు బలవంతంగా తమ సైన్యంగా మార్చుకుంటారనేది విమర్శ. ఈ క్రికెట్ టీం లను కూడా వాళ్ళు ఇతర దేశాలకు చాపకింద నీరులా వ్యాపించడానికి వాడుకుంటే ప్రమాదమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: