IPL కు ఆ ముగ్గురు దూరం?

Dabbeda Mohan Babu
ఐపీఎల్ రెండో ద‌శ ఈ నెల 19 నుంచి మొద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ రెండో ద‌శ యుద్ధానికి మూగ్గురు ఇంగ్లాండ్ ప్లేయ‌ర్లు డుమ్మ కొట్టారు. యూఏఈ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న క‌ఠిన నిబంధ‌న‌లు త‌మ‌కు ఇబ్బంది క‌రంగా ఉండ‌నున్నాయ‌ని భావించి ఇంగ్లాండ్ క్రికెట్ బొర్డు అంది. అందుకు గాను ఇంగ్లీష్ ప్లేయ‌ర్లు జానీ బెయిర్ స్ట్రో, డెవిడ్ మాల‌న్‌, క్రిస్ వోక్స్ ల‌ను ఐపీఎల్ ఆడ‌టం లేద‌ని ఇంగ్లాండ్ క్రికెట్ బొర్డు ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంతో వారు ప్ర‌తినిథ్యం వ‌హించే జ‌ట్టు లు కీల‌క ఆట‌గాళ్ల‌ను కోల్పొనుంది.

జానీ బెయిర్ స్ట్రో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అలాగే క్రిస్ వోక్స్ డిల్లీ క్యాపీట‌ల్స్ జ‌ట్టులో ఉన్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కు ఇంగ్లాండ్ ఆట‌గాడు డెవిడ్ మాల‌న్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వీరు ఈ మూడు జ‌ట్టుల‌లో కీల‌క ఆట‌గాళ్లు గా ఉన్నారు. ఈ మూగ్గురు ఐపీఎల్ ఆడకపోతే ఈ మూడు జ‌ట్లు తీవ్రంగా న‌ష్ట పోనున్నాయి.  క్రిస్ వోక్స్ త‌న ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో చాలా సార్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను విజ‌య తీరాల‌కు చేర్చాడు. అలాగే డెవిడ్ మాల‌న్ త‌న దూకుడైన ఆట‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు మంచి స్కోరు ను అందిచేవాడు. వీరు లేకుండా ఈ జ‌ట్లు ఎలా ఆడుతాయో అనేది ఈ రెండో ద‌శ ఐపీఎల్ లో చూడాలి.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు జానీ బెయిర్ స్ట్రో కీల‌క మైన ఆట‌గాడు. డేవిడ్ వార్న‌ర్‌తో ఎన్నో ఇన్నింగ్స్ ల‌ను నిల‌బెట్టాడు. డేవిడ్ వార్న‌ర్ విఫ‌లం అయిన‌ప్పుడు బెయిర్ స్ట్రో రైజ‌ర్స్ జ‌ట్టును నెల‌బెట్టేవాడు. జానీ బెయిర్ లేని లోటు  హైద‌రాబాద్ కు తెలుస్తుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ 7 మ్యాచ్ లు ఆడి కేవ‌లం ఒక మ్యాచ్‌లోనే గెలిచింది. ఇంకా 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.  ఈ 7 మ్యాచ్‌లో 6 మ్యాచ్ లు త‌ప్ప‌ని స‌రిగా గెలవాలి. అయితే నే ఫ్లే ఆఫ్స్ కు చేరుతుంది. బెయిర్ స్ట్రో లేకుండా 7 మ్యాచ్ ల‌ల్లో 6 గెల‌వ‌డం గ‌గ‌న‌మ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: