ఐపీఎల్ కోసమే.. బీసీసీఐ ఇదంతా చేస్తుంది?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతకుమించి అనే రేంజ్ లోనే ఐపీఎల్ ఫేస్ 2 ఉండబోతుందని అంచనాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్ల అందర్నీ కూడా యూఏఈ రప్పిస్తున్నాయి. బిసిసిఐ  ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ కేటాయించలేము అని చెప్పడంతో  ఆయా జట్ల ఫ్రాంచైజీలు ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటుచేసి ఆటగాళ్లను రప్పిస్తున్నాయ్ .

 కాగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ఫేస్-2 ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఫేస్ 2 లో భాగంగా మొదటమ్యాచ్ లో ఐపీఎల్లో దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది.  ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారో అన్నది కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇక ప్రస్తుతం ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ.. అటు టీం ఇండియాలో కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో చివరికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 5వ టెస్ట్ ఆడకుండానే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారింది.

 అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టెస్ట్ మ్యాచ్ రద్దు చేయడం పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు  టెస్ట్ మ్యాచ్ రద్దు నేపథ్యంలో ఐపీఎల్ కోసం ఆటగాళ్లను తరలిస్తున్నారు  అయితే యూఏఈ చేరుకున్న తర్వాత ఆటగాళ్లు అందరూ ఆరు రోజుల క్వారంటైన్ లో ఉండాలి టోర్నీ ప్రారంభం కావడానికి ఏడు రోజులు టైం మాత్రమే ఉంది  దీన్ని బట్టి చూస్తే అటు ఐపీఎల్ కోసమే అటు ఇంగ్లాండ్ టీం ఇండియా మధ్య జరిగే ఐదవ టెస్ట్ పట్టిస్తున్నారు రద్దు చేస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ మైకల్ వాన్ వ్యాఖ్యానించారు. వాన్ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారగా.. కరోనా వైరస్ భయలా మధ్య ఎలా మ్యాచ్ ఆడుతారు అంటూ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: