ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?

Veldandi Saikiran
ఇంగ్లాండ్ మరియు ఇండియా క్రికెట్ జట్ల మధ్య 5 వ టెస్టు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. టీమిండియా శిబిరంలో హెడ్ కోచ్ రవి శాస్త్రి తో పాటు మరో నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యం లోనే 5వ టెస్టు రెండు జట్ల ఏకాభిప్రాయం మేరకు రద్దు అయింది. అయితే  టెస్ట్ మ్యాచ్ రద్దు కావడం వల్ల...  ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు భారీ నష్టం వాటిల్లిందని సమచారం.  

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తో సహా లాంక షేర్ క్రికెట్ కు కూడా భారీ నష్టం వాటిల్లిందట. అయితే ఈ నష్టం భారత దేశ కరెన్సీ లో వందల కోట్ల కు పైగా ఉండవచ్చని అంచనావేస్తున్నారు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులు. ప్రసార హక్కులు మరియు ఇతర మార్గాల ద్వారా ఏకంగా 304 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టంచేశారు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి.  

కరోనా మహమ్మారి నేపథ్యం లో... ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసుకున్నామని... చెప్పారు ఆయన. కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు కావడం చాలా విచారకరమైన అంశం అని తెలిపారు.  ఇది ఇలా ఉండగా...  రద్దయిన ఐదవ టెస్టు... మ్యాచ్ నువ్వు వచ్చే సంవత్సరం ఇండియా పర్యటన లో పరిమిత ఓవర్ల సిరీస్ తోపాటు నిర్వహిం చాలని పరస్పర ఒప్పందాన్ని కుదుర్చు కున్నాయి రెండు బోర్డులు. ఈ విషయమై భారత క్రికెట్ బోర్డు అంగీకారం తెలిపిందని స్పష్టం చేశారు జైషా. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియ న్షిప్ 2021 - 23 లో భాగంగా జరుగు తున్న సిరీస్ కాబట్టి  ఇరు జట్ల కు న్యాయం జరగాలని నేపథ్యం లో ఈ మేరకు నిర్ణయం తీసు కున్నాయి రెండు దేశాల క్రికెట్ బోర్డులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: