ఆ ఇద్దరి కోసం చార్టెడ్ లైట్.. వెనక్కి తగ్గని ఆర్సిబి?

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్టు ఏది అంటే అందరూ చెప్పే పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.  ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ప్రతి సీజన్లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎన్నో అంచనాల మధ్య ఉంటుంది. ఇక ప్రతిసారీ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరి అభిమానులందరికీ నిరాశను మిగులుస్తుంది అన్న విషయం తెలిసిందే.

 కానీ గత సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కాస్త పటిష్టంగానే కనిపిస్తుంది. అయితే గత ఏడాది జరిగిన ఐపిఎల్ టైటిల్ విజేతగా నిలుస్తుంది అనుకున్నప్పటికీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇక ఈ సారి మాత్రం జట్టు ఎంతగానో పటిష్టంగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది.  ఇకపోతే ఈ సారి ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడు చూస్తే టైటిల్ గెలుస్తుంది ఏమో అన్నట్లుగానే ఉంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతుంది.

 ఈ క్రమంలోనే ఇక అన్ని జట్లు కూడా తమ ఆటగాళ్లను రప్పిస్తున్నాయి. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక ఆటగాళ్లు గా ఉన్న విరాట్ కోహ్లీ సిరాజ్ లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. అయితే వీరిద్దరిని యూఏఈ రప్పించేందుకు అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి విమానంలో బయలుదేరి ఆదివారం ఉదయం వరకు యూఏఈ చేరుకుంటుంది. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ సిరాజ్ ఇద్దరూ కూడా ఆరు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటారు. ఆటగాళ్లకు ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ లు  ఏర్పాటు చేయబోమని ఇక కమర్షియల్ ఫ్లైట్ లలోనే వెళ్లాలి అంటూ బిసిసిఐ ప్రకటించడంతో.. ఇక ఆయా జట్ల ఫ్రాంచైజీలు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇలా చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: