చివరి టెస్ట్ రద్దయితే నష్టపోయేది ఆ జట్టే... ?

VAMSI
ఈ రోజు ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన అయిదవ టెస్ట్ అనూహ్యంగా వాయిదా పడినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే రెండు జట్ల బోర్డ్ ల పూర్తి అంగీకారంతోనే వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. టీమ్ ఇండియా హెడ్ కోచ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ కు కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల నుండి కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుండి అతను క్వారంటైన్ లోనే ఉన్నాడు. ఈ షాక్ తో తేరుకున్న ఇండియా ప్లేయర్స్ అందరూ కరోనా పరీక్ష చేయించుకోగా అదృష్టవశాత్తూ అందరికీ నెగిటివ్ వచ్చింది. అయితే ముందు జాగ్రత్తగా టెస్ట్ ఆడకపోవడం మంచిదనే అభిప్రాయం కొందరి ఆటగాళ్లలో కలిగిందట, ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం.
బీసీసీఐ అంగీకారంతో అయిదవ టెస్ట్ వాయిదా వేయడానికి మొగ్గు చూపారట. మళ్లీ రేపు అందరికీ కరోనా పరీక్షలు జరిపి ఒకవేళ నెగిటివ్ వస్తే అందరి అభిప్రాయాన్ని తీసుకుని మ్యాచ్ ను జరపాలా వద్దా అని ఆలోచిస్తారట? అన్నీ అనుకూలంగా జరిగితే రెండు రోజులలో అంటే ఆదివారం టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. రేపు జరగబోయే కరోనా పరీక్షలో ఏ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లే. ఒకవేళ టెస్ట్ ను రెండు మూడు రోజులు అయినా పర్వాలేదు అనుకుని జరిపితే ఇంకో 9 రోజుల్లో జరగాల్సిన ఐపిఎల్ సెకండ్ విండో పై ఎఫెక్ట్ పడనుంది. దీనితో రెండు దేశాల బోర్డులు సందిగ్ధంలో పడ్డారు.
అయితే అయిదవ టెస్ట్ జరిగేది లేనిది, రేపు జరగబోయే కరోనా టెస్ట్ ల తర్వాత వచ్చే ఫలితం మీదనే ఆధారపడనుంది. ప్రస్తుతానికి 5 టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి టెస్ట్ రద్దు అయినా భారత్ కు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే ఇంగ్లాండ్ కు మాత్రం ఈ టెస్ట్ జరగకపోతే సీరీస్ ను ఒక మ్యాచ్ జరగకుండానే కోల్పోవాల్సి వస్తుంది. ఇది ఇంగ్లాండ్ బోర్డ్ జీర్ణించుకోలేని విషయం. లాస్ట్ టెస్ట్ జరిగి ఇంగ్లాండ్ గెలిస్తే సీరీస్ డ్రాగా ముగిసింది. లేదా మ్యాచ్ డ్రా అయిన ఇండియా కప్ ను సొంతం చేసుకుంటుంది. మరి ఏమి జరుగుతుందో చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: