ధోనీ నియామకంపై రభస..!

NAGARJUNA NAKKA
టీ 20 ప్రపంచ జట్టుకు మాజీ కెప్టెన్ ధోనీ బీసీసీఐ మెంటార్ గా ప్రకటించడంపై వివాదం చెలరేగుతోంది. అందుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా అభ్యంతరం తెలిపారు. ఒకే వ్యక్తి రెండు పదవుల్లో కొనసాగడం లోథా కమిటీ సిఫార్సుకు విరుద్దమన్నారు. ఈ మేరకు ఆయన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు గంగూలీ, జైషాకు లేఖ రాశారు.
దీనిపై గంగూలీ స్పందించారు. జట్టు లాభం కోసమే టీమిండియాకు మెంటార్ గా ధోనీని నియమించామని బీసీసీఐ చీఫ్ గంగూలీ తెలిపాడు. ధోనీ అనుభవాన్ని ఈ వరల్డ్ కప్ లో వినియోగించుకుంటామన్నాడు. అటు బీసీసీఐ చేసిన ప్రతిపాదనకు అంగీకరించిన మిస్టర్ కూల్ కు ధన్యవాదాలు చెబుతున్నట్టు దాదా చెప్పాడు.
మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, టీ 20 ప్రపంచ కప్ కు టీమిండియా మెంటార్ గా ఎంపికైన ధోనీకి మధ్య భేదాభిప్రాయాలు రావొద్దని ఆశిస్తున్నట్టు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. 2004లో తాను భారత జట్టుకు మెంటార్ గా ఎంపికైనప్పుడు నాటి కోచ్ జాన్ రైట్.. ఆయన స్థానాన్ని తాను భర్తీ చేస్తానేమో అనే దిగులుతో ఉన్నాడని గవాస్కర్ చెప్పాడు. కోచ్, మెంటార్ మధ్య ఏకాభిప్రాయం ఉండటం ముఖ్యమనీ సన్నీ తెలిపాడు.
ఇక టీ20 ప్రపంచ కప్ లో శిఖర్ ధావన్, చాహల్ లకు చోటు దక్కకపోడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇతర ప్లేయర్స్ కు ఛాన్స్ ఇవ్వడానికి ధవన్ కు రెస్ట్ ఇచ్చారట. ఓపెనర్లు ఎక్కువగా ఉండటం, ధవన్ ఆట వన్డేలకే భాగా సరిపోవడం లాంటి కారణాలతో తప్పించారట. యూఏఈ వికెట్లపై వేగంగా బౌలింగ్ చేసే రాహుల్ చహర్ వికెట్లు తీస్తాడని.. చాహల్ స్థానంలో తీసుకున్నారట. నటరాజన్ చాలా కాలంగా క్రికెట్ కు దూరంగా ఉండటంతో అతడిని తీసుకోలేదట. చూద్దాం.. టీ 20 ప్రపంచ కప్ కు సెలక్ట్ అయిన టీమిండియా.. ధోని అనుభవంతో ఎలాంటి విజయాలు సాధిస్తుందో.  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: