టీమిండియా శిబిరంలో క‌రోనా క‌ల‌క‌లం.. ఐదో టెస్టుపై నీలినీడ‌లు?

Dabbeda Mohan Babu
ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న టీమిండియా కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. క‌రోనా కేసులు వెంటాడుతున్నాయి. ఒక‌రి నుంచి ఒక‌రికి వ్యాప్తి చేందుతూనే ఉంది. ఇప్ప‌టికే టీమిండియాకు చెందిన ప‌లువురు నాలుగో టెస్టు మ్యాచ్ ఆడుతున్న‌ప్ప‌డు క‌రోనా వైర‌స్ భారి ప‌డ్డారు. హెడ్ కోచ్ ర‌విశాస్త్రీతో పాటు బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధ‌ర్ తో పాటు ఫిజియోధెర‌పిస్ట్ లు క‌రోనా భారిని ప‌డ్డారు. వీరి తో పాటు తాజాగా టీమిండియా బృందంలోని మ‌రోక‌రికి పాజిటివ్ గా తెలింది. దీంతో రేప‌టి నుంచి ట్రాఫొర్టులో జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టు నిర్వ‌హించ డానికి వీలు ఉంటుందో లేదా అనే సందేహం టీమిడింయా అభిమానుల్లో నెల‌కొంది. ఇప్ప‌టికే కోహ్లి సేన ప్రాక్టీస్ ను ర‌ద్దు చేసుకుంది. ఆటగాళ్లంతా త‌మ త‌మ హోట‌ల్ రూం ల‌ల్లోనే ఉంటున్నారు.

కాగ శుక్ర‌వారం మ‌రోసారి ఆట‌గాళ్ల అంద‌రికీ క‌రోనా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. వాటి ఫ‌లితాల ఆధారం గా ఐదో టెస్టు జ‌రుగుతుందా లేదా అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భిస్తుంది. అంద‌రికీ నెగిటివ్ వ‌స్త‌నే శుక్ర‌వారం ఐదో టెస్టు ఆట‌కం లేకుండా జ‌రుగుతుంది. కానీ ఒక్క‌రికీ పాజిటివ్ వ‌చ్చినా.. శుక్ర‌వారం నాటి మ్యాచ్ ర‌ద్దు అయ్యే అవ‌కాశం లేదా వాయిదా అయ్యే అవ‌కాశం ఉండ‌నుంది.

ఐదు టెస్టుల ఈ సిరిస్‌లో ఇప్ప‌టికే టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంతో ముందు ఉంది. ఒక వేళ శుక్ర‌వారం నాటి ఐదో టెస్టు మ్యాచ్ ర‌ద్దు అయినా ఈ సీరిస్ టీమిండియా కే ద‌క్కుతుంది.  అదే జ‌రుగుతే ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ నెగ్గిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించ నున్నాడు. ఈ టెస్టు సిరిస్‌లో ఒపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఇంగ్లాండ్ గ‌డ్డ పై మొద‌టి సారి సెంచ‌రీ సాధించాడు. ఈ సిరిస్ మొత్తం టీమిండియా ఆల్ రౌండ్ ఫ‌ర్మామెన్స్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: