విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీళ్ళే ?

Veldandi Saikiran
పెళ్లి అంటేనే నూరేళ్ల బంధం అంటారు మన పెద్దలు. అందుకే వివాహం చేసుకునే ముందు వెనక ముందు ఆలోచించి చేసుకోవాలి అంటారు. అయితే... ఇంత ఆలోచించి పెళ్ళి చేసుకున్న కొంత మంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ లిస్టులో చిత్ర పరిశ్రమకు చెందిన వారు మరియు క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే... తీసుకున్న క్రికెటర్ల గురించి ఇప్పుడు చూద్దాం.. భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. 2012 సంవత్సరంలో ఆయేషా ప్రేమించి పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్ ... కొన్ని మనస్పర్థల కారణంగా తాజాగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయేషా ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. తమ మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే తాము విడిపోతున్నానంటూ భావోద్వేగానికి గురైంది.
ఇక టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ సైతం తన మొదటి భార్య నిఖిత కు డైవర్స్ ఇచ్చిన సంగతి విదితమే... టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ కారణంగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు దినేష్ కార్తీక్. తరచు దినేష్ కార్తీక్ ఇంటికి వెళ్లిన మురళీ విజయ్... అతని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియగానే తన భార్యకు విడాకులు ఇచ్చాడు దినేష్ కార్తీక్. ప్రస్తుతం మురళీ విజయ్ ని పెళ్లి చేసుకుంది దినేష్ కార్తీక్ భార్య. నికిత కు విడాకులు ఇచ్చిన తర్వాత.... దీపిక పల్లికల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దినేష్ కార్తీక్. ప్రస్తుతం ఈ జంట చాలా ఆనందంగా ఉంది.

ఇక అటు మన భారత జట్టు... మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ కూడా తన మొదటి భార్య నౌరిన్ కు డైవర్స్ ఇచ్చాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం సినిమా స్టార్ సంగీత ను 1996 లో వివాహం చేసుకున్నాడు మహమ్మద్ అజారుద్దీన్. అక్కడితో ఆగకుండా ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు ఈ మాజీ సారథి. అలాగే వినోద్ కాంబ్లీ.. కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. 1998 సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితురాలు పెళ్లి చేసుకున్నారు వినోద్ కాంబ్లీ... కొన్ని అనివార్య కారణాలవల్ల తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆండ్రియా హెవిట్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ కూడా తన మొదటి భార్యకు డైవర్స్ ఇచ్చాడు. ఆ ఎపిసోడ్ అనంతరం... ఓ జర్నలిస్టు ను పెళ్లి చేసుకున్నాడు జవగళ్ శ్రీనాథ్. ఇటు యువరాజ్ సింగ్ తండ్రి, ఇండియా మాజీ క్రికెటర్ యోగిరాజు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. కొన్ని అనివార్య కారణాలవల్ల విడిపోయిన యోగిరాజ్..  ఆతర్వాత సత్వీర్ కౌర్ ను పెళ్లి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: