నాలుగో టెస్ట్‌ లో రికార్డుల మోత ?

Veldandi Saikiran
లండన్‌ లోని ఓవల్‌ వేదిక గా ఇంగ్లండ్‌  జట్టు మరియు భారత్‌ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌  చాలా ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్‌ లో అనూహ్య రీతిలో టీమిండియా విజయం సాధించింది.  మొదట్లో ఇంగ్లాండ్‌ జట్టు గెలుస్తుందని అందరూ అనుకున్నా... మ్యాచ్‌ మన వైపు తిరిగింది. అయితే... ఈ మ్యాచ్‌  విజయంతో ఇండియా చాలా రికార్డులు బ్రేక్‌ చేసింది.  ఓవల్‌లో ఇంగ్లండ్‌-ఇండియా మధ్య మొత్తం 14 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఐదు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలవగా... కేవలం రెండుసార్లు మాత్రమే భారత జట్టు గెలుపొందింది.

 

1936లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత 1946లో, 1952లో జరిగిన టెస్టులు డ్రాగా ముగిశాయి. 1959లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 27 పరుగుల తేడాతో గెలిచింది. నెక్ట్స్ మ్యాచ్‌ 1971లో జరిగింది. ఆ టెస్టులోనే ఓవల్‌లో టీమిండియా తొలిసారి విజయం సాధించింది.  ఇక 1979 నుంచి 2007 దాకా ఓవల్‌లో ఇంగ్లండ్‌-ఇండియా 5 సార్లు తలపడగా... ఆ టెస్ట్‌లన్నీ డ్రాగా ముగిశాయి. 2011లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది.

2014లో జరిగిన టెస్ట్‌లోనూ ఇండియా... ఇంగ్లండ్‌ చేతిలో దారుణంగా పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్‌ 244 పరుగుల భారీ తేడాతో గెలిచింది.. ఇంగ్లండ్‌. 2018లో జరిగిన టెస్ట్‌లోనూ 118 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌... ఓవల్‌లో ఇండియాపై హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. మూడేళ్ల తర్వాత జరిగిన తాజా మ్యాచ్‌లో భారత్‌ 157 పరుగుల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ ఓవల్‌లో 5 మ్యాచ్‌లు గెలవగా... భారత్‌ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విక్టరీ కొట్టింది. అది కూడా 50 ఏళ్ల గ్యాప్‌లో ఈ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: