టెస్టుల్లో బుమ్రా నయా రికార్డు

Dabbeda Mohan Babu
భార‌త జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా న‌యా రికార్డును నెల‌కొల్పాడు. ఈ రోజు ఇంగ్లాండుతో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో జానీ బెయిర్ స్టోను అవుట్ చేశాడు. దీంతో టెస్టుల్లో 100 వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌల‌ర్ గా రికార్డు సాధించాడు. అంతే కాకుండా అత్యంతా వేగంగా ఈ ఫీట్ సాధించిన ఫాస్ట్ బౌల‌ర్ త‌న పేరును రికార్డు పుట‌ల‌ల్లో లిఖించుకున్నాడు. బుమ్రా క‌న్న ముందు క‌పీల్‌దేవ్ ఉండేవాడు. క‌పీల్ దేవ్ 100 వికెట్లు తీయ‌డానికి 25 టెస్టులు ఆడితే జ‌స్ప్రిత్ బుమ్రా 24 టెస్టు మ్యాచ్ ల‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు.
వీరీతో పాటు ఇషాంత్ శ‌ర్య 33 టెస్టు మ్యాచ్ ల‌ల్లో, జ‌వ‌గ‌ళ్ శీనాథ్ 30 టెస్టు మ్యాచ్ ల‌ల్లో, మ‌హ్మ‌ద్ ష‌మీ 29 టెస్టు మ్యాచ్ ల‌ల్లో, ఇర్ఫాన్ ప‌ఠాన్ 28 టెస్టు మ్యాచ్ ల‌ల్లో 100 వికెట్ల‌ను తీశారు.  ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో ఈ ఫాస్ట్ బౌల‌ర్ మిడిలార్డ‌ర్ బ్యాట్య్ మెన్ జానీ బెయిర్ స్టోను డ‌కౌట్ గా అవుట్ చేశాడు. అలాగే ఓలీ పోప్ ను 2 ప‌రుగుల వ‌ద్ద‌నే అవుటు చేసి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డ‌ర్ కుప్ప‌కూల్చాడు.

జ‌స్ప్రిత్ బుమ్రా 2016లో ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2016లో ఆస్ట్రేలియాలో జ‌రిగి వ‌న్డే, టెస్టు మ్యాచ్ ల‌ల్లో మొద‌టి సారి ఆడాడు. జ‌స్ప్రిత్ బుమ్రా ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌న్డేల‌ల్లో 108 వికెట్లు తీశాడు. అలాగే టీ ట్వంటీ ల‌ల్లో 59 వికెట్ల‌ను ప‌డ‌గోట్టాడు. టెస్టుల‌ల్లో 2018లో అరంగేట్రం చేశాడు. అందులో 24 టేస్టులు ఆడి 101 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. 2.67 అద్భ‌త‌మైన ఎకాన‌మీతో బంతులను విసిరేవాడు. బుమ్రా ఐపీఎల్ లోనూ అద్భ‌త‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తున్నాడు. జ‌స్ప్రిత్ బుమ్రాను ముంబాయ్ ఇండియ‌న్స్ ఐపీఎల్ కోసం 7 కోట్ల కు కొనుగోలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: