పాక్ జ‌ట్టుకు షాక్! హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ రాజీనామా

Dabbeda Mohan Babu
పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. టీ ట్వంటీ వ‌ర‌ల్డ్ క‌ప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌లోనే ఆ జ‌ట్టులో కుదుపులు మొద‌ల‌య్యాయి. జ‌ట్టు హెడ్ కోచ్ మిస్బా ఉల్ హ‌క్‌, బౌలింగ్ కోచ్ వ‌కార్ యూనిస్‌లు త‌మ కోచ్ ప‌ద‌వుల‌కు రాజినామా స‌మ‌ర్పించారు. ఈ అంశం పాకిస్థాన్‌లో పెద్ద దూమ‌రం రేపుతోంది. వారు త‌ప్పుకోవ‌డానికి కోవిడ్ నిభంద‌న‌లు, ఆరోగ్య అంశాలు చూప‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ఆ దేశ క్రికేట్ జ‌ట్టు అభిమానులు అంటున్నారు. రానున్న కాలంలో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ బోయే మ్యాచ్‌ల‌కు తాత్కాలికంగా అబ్దుల్ ర‌జ‌క్‌, స‌క్లెయిన్ ముస్త‌క్‌ల‌ను ఆయా స్థానాల‌ల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరిని నియ‌మించింది. వీరి రాజినామాల‌తో పాకిస్థాన్ క్రికెట్ పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది.

న్యూజిలాండ్ తో జ‌ర‌గ‌బోయే సిరిస్ కు అలాగే టీ ట్వంటీ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌పై ప్ర‌భావం ఉండ‌నూంది. రాబోయే టీ ట్వంటీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ తో త‌ల‌ప‌డ‌నుంది. గ్రూప్ స్థాయిలో ఆక్టోబ‌ర్ 24న దుబాయ్‌లో ఆడ‌నున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జ‌ట్టుల‌కు చాలా కీల‌కంగా మార‌నుంది. చాలా కాలం త‌ర్వాత దాయాదీ జ‌ట్టులు త‌ల‌ప‌డటంతో గెలుపు కోసం రెండు దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. దాన్ని కోసం పాకిస్థాన్ బ‌ల మైన జ‌ట్టును సైతం ప్ర‌క‌టించింది.
ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా బాబ‌ర్ అజామ్ ఉండ‌నున్నాడు. అలాగే బ్యాట్స్‌మెన్‌ల‌ను ఐదుగురిని, వికెట్ కీప‌ర్లుగా ఇద్ద‌ర‌ని ఎంపిక చేశారు. అలాగే ఆల్‌రౌండ‌ర్ల‌ను న‌లుగురిని, ఫాస్ట్ బౌల‌ర్ల‌ను న‌లుగురు చోటు ద‌క్కించుకున్నారు. రిజ‌ర్వ్ ఆట‌గాళ్లుగా ఫఖర్‌ జమన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలు ఉన్నారు. స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, షోయ‌బ్ మాలిక్ వంటి సీనియ‌ర్ల‌కు చోటు ద‌క్క‌క పోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

పాక్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన టీ ట్వంటీ ప్రపంచకప్‌ జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), ఆసిఫ్ అలీ, మహ్మద్ హఫీజ్, అజమ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం, సోహైబ్ మక్సూద్,  షాహిన్ అఫ్రిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: