టోక్యో ఒలంపిక్స్ : నిబంధ‌న‌లు ఉల్లంగించిన‌ పాకిస్థాన్ అథ్లెట్ లు.. !

MADDIBOINA AJAY KUMAR
శుక్రవారం టోక్యో ఒలంపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బాణా సంచా పేల్చి ఒల‌పింక్ క్రీడ‌ల‌ను ప్రారంభించారు. అయితే టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న గ్రామంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గుముకం ప‌ట్టిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. దాంతో కరోనా నిబంధ‌న‌ల మ‌ధ్య‌ ఈ ఒలింపిక్ క్రీడ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే శుక్రవారం ఒల‌పింక్ క్రీడ‌ల‌ ప్రారంభోత్సవం సందర్భంగా టోక్యో నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ ఒలంపిక్ జట్టు కు చెందిన జెండా మోసేవారు తమ హక్కులను పెట్టుకోకుండా కరోనా నిబంధనలకు విరుద్ధంగా వచ్చారు. అయితే ఆటగాళ్లు మాత్రం ముఖాలకు మాస్క్లు కప్పి ఉంచుకున్నారు. 

కానీ కవాతు చేస్తున్న సంధ‌ర్భంలో ఆట‌గాళ్ల లో కూడా కొంద‌రు త‌మ మాస్క్ ల‌ను కింద‌కు లాగారు. బ్యాట్మెంటన్ ప్లేయర్ మహూర్ షాజాద్ మాస్క్ ను ముక్క‌కు పెట్టుకోకుండా అతడి గడ్డానికి కిందగా పెట్టుకున్నాడు.ఇక మ‌రో ఆటాగాడు షూట‌ర్ క‌లీల్ అక్త‌ర్ త‌న మాస్క్ ను ముక్కు వేసుకోకుండా నోటికి వేసుకున్నాడు. టోక్యో 2020 ప్లే బుక్స్ మ‌రియు క‌రోనా నిబంధ‌న‌ల‌ ప్రకారంగా ఒలంపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులు మరియు వాలంటీర్లు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ మాస్కు ధరించి ఉండాలి.  అంతే కాకుండా ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక దూరాన్ని ఖ‌చ్చితంగా పాటించాలి. క్రీడ‌ల్లో గెలిచిన అనంత‌రం కూడా గుంపులు గుంపులుగా ఫోటోలు దిగేందుకు అనుమ‌తులు లేవు.

పతకాలు సాధించిన విజేతలు కూడా సామాజిక దూరం కచ్చితంగా పాటించాల్సిందే. ఇది వ‌ర‌కూ ప‌త‌కాలు గెలిచిన వారికి అభినంధ‌న‌లు తెల‌ప‌డం మ‌రియు ప‌త‌కాలు గెలిచిన వారు ప‌క్క ప‌క్క‌న నిలుచుని ఉండ‌టం లాంటివి క‌నిపించేవి కానీ ఈ యేడాది గోల్డ్ మెడల్ సాధించిన వారు ఒక రింగ్ లో....సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన వారు ఒక రింగ్ లో ఇలా వేరు వేరుగా ఉండాల్సిందే. అంతే కాకుండా ప‌రేడ్ సంధ‌ర్భంగా కూడా అథ్లెట్ లు సామాజిక దూరం పాటించాల్సిందే. మ‌రోవైపు షో పీస్ కోసం క్రీడాకులు ఒంటరిగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇలా ఎన్నో క‌రోనా నిబంధ‌న‌ల మ‌ధ్య ప్ర‌స్తుతం ఒలంపిక్స్ జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: