ధోని కారణం కాదు.. నేనే బాగా ఆడలేదు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత లెజెండరీ క్రికెటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దిగ్గజ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్రసింగ్ ధోని. తన కెప్టెన్సీ లోనే ఇక ఏకంగా రెండు ప్రపంచ కప్ లు అందించి ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డును సృష్టించాడు  ఇక ఇప్పటికికూడా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత..  సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎంతోమంది క్రికెటర్లపై వేటు పడింది.

 ముఖ్యంగా ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్థానం కల్పించి సీనియర్ క్రికెటర్లు జట్టు నుంచి తొలగిస్తూ వచ్చాడు మహేంద్రసింగ్ ధోని. అప్పట్లో ధోని పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. పలుమార్లు సీనియర్ క్రికెటర్లు ఇక ధోనీ జట్టు నుంచి తమను తప్పించడాంపై తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవలే టీమిండియా మాజీ వికెట్కీపర్ పార్థివ్ పటేల్ తన కెరియర్ ముగిసిపోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు  టీమిండియాలో తాను చోటు కోల్పోవడానికి ఎమ్మెస్ ధోనీ కారణం కాదు అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్ పటేల్. నిజానికి తాను ధోని కంటే ముందే జట్టులోకి అరంగేట్రం చేశా అంటూ తెలిపాడు.


 అంతేకాకుండా ధోనీతో పాటు సమాంతరంగా తన కెరియర్ వుండడాన్ని దురదృష్టంగా భావించను అంటూ చెప్పుకొచ్చాడు. తాను అంతర్జాతీయ స్థాయిలో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేక పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాను. ఇక అయినప్పటికీ టీమిండియా తనకు అవకాశాలు ఇచ్చిందని కానీ తనను తాను నిరూపించుకోలేక పోయాను అంటూ చెప్పుకొచ్చాడు   అదే సమయంలో ఇక జట్టులోకి ధోని రావడం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో ఇక ధోనీ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

 తాను భారత్ తరఫున ఏకంగా 19 టెస్టులు ఆడానని 19 టెస్టులు అంటే తక్కువ అవకాశాలు అని నేను అనుకోను అంటూ తెలిపాడు.  కాగా 2002లో టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు పార్థివ్ పటేల్. కానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోకి వచ్చాడు.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఒక అంతర్జాతీయ స్టార్ గా ఎదగడం తో చివరికి పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్ కు అంతగా అవకాశాలు దక్కకుండా పోయాయ్. ఈ క్రమంలోనే గత కొన్ని నెలల క్రితం తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు పార్థివ్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: