టోక్యో ఒలంపిక్స్ : క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత్?

praveen
ప్రపంచ క్రీడా ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలంపిక్స్ ఇటీవలే ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఒలంపిక్స్ మెగా టోర్నీ జరుగుతుందా లేదా అని అందరూ అనుకున్నారు. కానీ జపాన్ ప్రభుత్వం ఎంతో సాహసోపేతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఓవైపు కరోనా వైరస్ వల్ల అడుగడుగునా ఇబ్బందులు వస్తున్నప్పటికీ మరోవైపు జపాన్ ప్రభుత్వం మాత్రం కఠిన నిబంధనల మధ్య ఒలంపిక్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ అన్ని దేశాలకు చెందిన ఆటగాడు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఇప్పటికే సిద్ధమైపోయారు.  ఇక అటు భారత్ నుంచి ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు కూడా పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.

 ఇప్పటికే ఒలంపిక్స్ మెగా టోర్నీకి కోసం భారత క్రీడాకారుడు అందరూ ఎన్నో రోజుల నుంచి తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నారు.  ఒలంపిక్స్ మెగా టోర్నీలో వచ్చిన అవకాశాన్ని అసలు చేర్చుకునేందుకు సిద్ధంగాలేరు భారత క్రీడాకారులు. ఈ క్రమంలోనే  అన్ని విభాగాల్లో కూడా భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఏకంగా ఆర్చరీ విభాగంలో భారత్ సెమీ ఫైనల్స్ కి దూసుకెళ్లడం భారత ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది.  ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ ఆర్చరీ మిక్స్డ్ ఆర్చరి విభాగంలో భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించారు.

 ఇది భారత ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పాలి  చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయాన్ని సాధించారు  ఇక ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టారు ఆర్చరీ మిక్స్డ్ విభాగంలోని భారత క్రీడాకారులు. ఇక ఈ క్వార్టర్ ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫైర్ లో భారత్కు నిరాశ ఎదురైంది  భారత షూటర్లు ఫైనల్కు చేరుకోలేక నిరాశ పరిచారు  అయితే ప్రస్తుతం ఒలంపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు అందరినీ ప్రోత్సహించేందుకు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ప్రముఖులు అభిమానులు సైతం పోస్టులు పెడుతూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: