ఒలంపిక్స్ : పథకం గెలిస్తే ఇక కోట్లే?

praveen
నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటల పండుగ ఒలంపిక్స్ మెగా టోర్నీలో పాల్గొనాలి అనేది ప్రతి ఒక్క అథ్లెట్ కలగా ఉంటుంది. ఒలంపిక్స్ లో పాల్గొని తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్క అథ్లెట్ రంగంలోకి దిగుతున్నాడు  అయితే ఒలింపిక్స్లో పతకం సాధిస్తే తమకు పేరు రావడమే కాదు దేశ ప్రతిష్టను  సైతం నిలబెట్టిన వారిగా మారతాము అని ప్రతి ఒక క్రీడాకారుడు భావిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఎన్నో ఏళ్ల నుంచి తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు ప్రతి ఒక క్రీడాకారుడు. ఒలంపిక్స్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాధించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక ఎన్నో రోజుల నుంచి క్రీడాకారులు అందరూ ఎదురుచూస్తున్న ఒలంపిక్స్ ఇటీవలే ప్రారంభమైంది.

 ఒలింపిక్స్ లో పతకం సాధించేందుకు అందరూ క్రీడాకారులు సిద్ధమయ్యారు. అన్ని దేశాల క్రీడాకారులు ప్రస్తుతం హోరాహోరీగా తలపడుతున్నారు. పతకం సాధించే అథ్లెట్ లకు  ప్రభుత్వాలు ఎంతగానో ప్రోత్సాహకాలు బహుమతులు అందిస్తూ ఉంటాయి   ఇక ఒక్కో దేశంలో ఒక రేంజ్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు నజరానాలు ప్రకటిస్తూ ఉంటాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. భారతదేశం విషయానికి వస్తే బంగారు పతకం గెలిచిన వారికి 75 లక్షలు, రజతం గెలిస్తే 50 లక్షలు, కాంస్య పథకం గెలిస్తే 30 లక్షలు ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక తమ రాష్ట్రం తరఫునుంచి ఒలంపిక్స్ లో పాల్గొంటున్న అథ్లెట్లు స్వర్ణ గెలిస్తే 6 కోట్లు, రజతం 4 కోట్లు, కాంశ్యం గెలిస్తే 2.5 కోట్లు ఇస్తామని హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా,చండీగఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ రాష్ట్రం తరఫున ఒలింపిక్స్ లో పాల్గొనీ స్వర్ణ పతకం గెలిచేవారికి ఐదు కోట్లు ఇస్తామని గుజరాత్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఢిల్లీ ప్రభుత్వం స్వర్ణ పతకం గెలిచిన వారికి మూడు కోట్ల నజరానా ప్రకటించింది.

 అయితే ఇక మిగతా దేశాలలో చూస్తే... అథ్లెట్ లు  బంగారు పతకం గెలిస్తే.. ఇండోనేషియా 7,46,000 డాలర్లు (రూ.5.55కోట్లు),  సింగపూర్‌ 735,000 డాలర్లు (రూ.5.47 కోట్లు), హాంకాంగ్‌ 644,000 డాలర్లు (రూ.4.80కోట్లు), థాయ్‌లాండ్‌ 309,000 డాలర్లు (2.30కోట్లు), కజకిస్థాన్‌ 250,000 డాలర్లు (రూ.1.86కోట్లు), ఇటలీ 212,000 డాలర్లు (1.58కోట్లు), అమెరిక 37,500 డాలర్లు (రూ.28లక్షలు), జపాన్‌ 45,200 డాలర్లు (రూ.34లక్షలు) నజరానా ప్రకటించాయి . ఇక ఫ్రాన్స్‌ 65,000 డాలర్లు (రూ.48లక్షలు), రష్యా 61,000 డాలర్లు (రూ.45లక్షలు), బ్రెజిల్‌ 47,500 డాలర్లు (రూ.35లక్షలు), దక్షిణాఫ్రికా 37,000 (రూ.27.5లక్షలు) నెదర్లాండ్స్‌ 35,400 డాలర్లు (రూ.26లక్షలు), జర్మనీ 22,000 డాలర్లు (రూ.16లక్షలు), కెనడా 16,000 డాలర్లు  (రూ.12లక్షలు), ఆస్ట్రేలియా 15,100 డాలర్లు (రూ.11లక్షలు) బహుమతిగా ఇవ్వనున్నాయి.
బ్రిటన్‌, నార్వే, స్వీడన్‌ దేశాలు మాత్రం అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు కాకుండా.. ఏటా 160 మిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఇక ప్రభుత్వం కేటాయించిన ఈ డబ్బులు మొత్తం  అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్‌ రూపంలో ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: