టిటిడి కొత్త వేడుకోలు.. ఎంటబ్బా !


తిరుమల తిరుపతి దేవస్థానం, అదికారులు,  పాలక మండలి భక్తులకు తాజా గా మరో విజ్ఞప్తి చేసింది. శ్రీనివాస స్వామి భక్తులు కోవిడ్-19 టీకా వేసుకున్న వారు మాత్రమే దర్శనానికి రావాలని,   నలభై ఎనిమిది గంటల ముందు ఆర్టీ పిసిఆర్ నెగటివ్ రిపోర్టును అలిపిరి టోల్ గేట్ వద్ద చూపించాలని ఇది వరకే  పేర్కోంది. తాజాగా మరో సారి మరో విషయమై భక్తులకు విజ్ఞప్తి చేసింది.
తిరుమల లోని నాదనీరాజనం వేదిక పై నిత్యం ఏదో ఒక భగవత్ సంబంధిత కార్యక్రమాలు జరుగుతుంటాయి. తిరుమల గిరులలో అవి ప్రతిధ్వనిస్తుంటాయి.  ఆ వేదిక మీద నిర్వహిస్తున్న కార్యక్రమాలో ప్రధాన మైనది  భగవద్గీత ప్రవచనం. ఈ  అఖండ పారాయణం ముంగింపు జనవరి 13 న జరగ వలసి ఉంది. ముందుగా నిర్ణయించన ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించేందుకే టిటిడి అధికారులు  మొగ్గుచూపుతున్నారు. ముగింపు సందర్భంగా  అదే రోజున సంపూర్ణ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. భగవద్గీత లోని  18 అద్యాయాలు, అందులోని 700 శ్లోకాలను  నిలుపు లేకుండా పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమంలో  ధర్మగిరి లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుంబంధంగా నడిచే విద్యాసంస్థ ఎస్వీ వేద పాఠశాల విద్యార్థులు, తిరుపతిలో ని సంస్కృత విద్యాపీఠంకు చెందన విద్యార్థి,  అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు.
కాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీరిని తప్ప మరోకరిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి అనుమతి నిరాకరించింది. కోవిడ్-19 నిబంధనలు అమలులో భాగంగా భక్తులు అందరూ తమ తమ ఇళ్లలోనే ఉండి భగవన్నామాన్ని జపించాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమాన్ని ఆద్యంతం ఎస్.వి.బి.సి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపింది. శ్రీవారి భక్తులందరూ  సంప్రదాయ దుస్తులు ధరించి ఇళ్లలోనే పారాయణం పూర్తి చేయాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.భక్తుల ఆరోగ్య పరిరక్షణ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: