సోమవారం ఇలా చేస్తే శివుడు ప్రసన్నం

Vimalatha
సోమవారం శివునికి ప్రత్యేకమైన రోజు. ఈరోజు శివుడిని కొలుస్తారు హిందువులు. తమ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున శివుని పూజిస్తారు. నీరు సమర్పించడం ద్వారా కూడా శివుడు ప్రసన్నుడై తన భక్తులను అనుగ్రహిస్తాడని చెబుతారు. అందుకే సోమవారం ఉదయం లేచిన తర్వాత శివుని దర్శనం చేసుకుని శివ చాలీసా లేదా శివాష్టకం పఠించవచ్చు. హృదయపూర్వకంగా ఆరాధించడం ద్వారా శివుడు సంతోషించి, జీవితంలోని సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అయ్యే మార్గాన్ని చూపిస్తాడని అంటారు. సోమవారం శివుడికి పాలు సమర్పించడం గురించి కూడా ప్రాముఖ్యత ఉంది. పాలతో కొన్ని నివారణలు చేస్తే భక్తులు చాలా ప్రయోజనాలను పొందుతారు. సోమవారం పాలతో ఇలా చేశారంటే శివుడు ప్రసన్న అవ్వడం ఖాయం.
జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తొలగించడానికి...
సోమవారం ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి పచ్చి పాలను సమర్పించండి. 5 లేదా 7 సోమవారాలు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అంతే కాదు ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది.
కంటి లోపాలను తొలగించడానికి
కంటి లోపాలను నివారించడానికి ఆదివారం రాత్రి మీ పక్కన 1 గ్లాసు పాలను పెట్టుకుని నిద్రపోవాలి. దీని తరువాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి, ఏదైనా పటిక చెట్టు వేరులో పాలు పోయండి. ఇది దృష్టి లోపాన్ని తొలగిస్తుంది.
వైవాహిక జీవితంలో మాధుర్యం కోసం
వైవాహిక జీవితంలో ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా లేదా వివాహానికి ఏదైనా ఆటంకం కలిగినా, సోమవారం ఉదయం శివాలయంలో గౌరీ, శంకర రుద్రాక్షను సమర్పించాలి. అలాగే మీరు మీ మనసులోని మాటను దేవుడితో చెప్పాలి.
డబ్బు కొరతను అధిగమించడానికి
జీవితంలో డబ్బు సమస్యను ఎదుర్కొంటే ప్రతి సోమవారం శివలింగానికి పాలు కలిపిన నీటిని సమర్పించండి. అంతే కాదు రుద్రాక్ష మాలతో ఓం సోమేశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. పౌర్ణమి నాడు పాలు కలిపిన నీటితో చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా శివుడి వారి జీవితంలోని ప్రతి కష్టాలను తొలగిస్తాడు. జీవితంలో ఆనందం, సంపదల వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: