పితృ పక్షంలో శుభకార్యాలు ఎందుకు చేయొద్దో తెలుసా ?

Vimalatha
గణేష్ పండుగ పూర్తయిన తర్వాత పితృ పక్షం ప్రారంభమవుతుంది. పితృ పక్ష సమయంలో ఏ శుభ కార్యం జరగదు. శ్రద్ధ కార్యానికి సంబంధించి కొన్ని నియమాలు పాటించాలి. సెప్టెంబర్ 2021 సోమవారం నుండి పితృ పక్ష 2021 ప్రారంభం కానుంది. దీనిని శ్రద్ధ పక్ష అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం పితృ పక్షం భాద్రపద నెల పౌర్ణమి నుండి ప్రారంభమవుతుంది. అమావాస్య వరకు కొనసాగుతుంది. మొత్తం 15 రోజుల ఈ శ్రాద్ధ పక్షం మన పూర్వీకులకు అంకితం చేస్తారు. ఈసారి పితృ పక్షం అక్టోబర్ 6 బుధవారం వరకు వస్తుంది. పితృ పక్ష సమయం లో షేవింగ్, నిశ్చితార్థం, వివాహం, ఇంటి షాపింగ్ వంటి శుభ కార్యాలు చేయరాదని అంటారు. నిశ్చితార్థం, వివాహం వంటి వాటి గురించి మాట్లాడటం కూడా నిషిద్ధమే. అయితే దీనికి గల కారణం ఏంటి అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
పితృ పక్ష సమయంలో పూర్వికులు మన మధ్యకు వస్తారని, వారిని గౌరవించాలని నమ్ముతారు. ఈ 15 రోజులు వారి పట్ల కృతజ్ఞతలు తెలియజేయడం, వారితో ఆధ్యాత్మికంగా కనెక్ట్ కావడం కోసం పలు ఆచారాలను పాటిస్తారు. పూర్వీకులు తమ కుటుంబ సభ్యులు ఇప్పటికీ తమ కొరతను అనుభవిస్తున్నారని ఈ సమయం లో తెలుసుకుంటారట. తండ్రులు తమ పట్ల తమ పిల్లల అభిమానాన్ని చూసి సంతోషించి ఆశీర్వాదాలతో వెళ్లిపోతారని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో మన అలవాట్లు, అభిరుచులు, పవిత్రమైన పనులను పక్కన పెట్టి వారి కోసం గౌరవం, అంకితభావం తో సాంప్రదాయాలు ఆచరించాలి. లేదంటే పూర్వీకులు శపిస్తారని ఒక నమ్మకం ఉంది. అందుకే పితృ పక్ష రోజుల్లో ఎలాంటి శుభ కార్యాల జోలికి వెళ్లరు. పితృ పక్షం లో శుభ కార్యాలు చేయకపోవడానికి కారణం ఇదే అన్న మాట !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: