చార్ ధామ్ యాత్ర .. షురూ ..

కరోనా కారణంగా చాలా విషయాలు వాయిదా పడ్డాయి. అందులో చార్ ధామ్ యాత్ర కూడా ఉంది. కేవలం కొందరినే అనుమతించే ఈ యాత్రకు కరోనా సమయంలో ఆ మాత్రం కూడా అనుమతి ఇవ్వలేక పోయారు. అలాంటిది ఇప్పుడే కాస్త కరోనా కేసులు తగ్గుతుండటంతో నేటి నుండి ఈ యాత్ర కు అధికారులు అనుమతి ఇచ్చారు. హై కోర్ట్ నిషేధం ఎత్తివేసిన తరువాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే కనీస నిబంధనలు పాటించాలని సూచించింది. కరోనా లేదనే సర్టిఫికెట్, వాక్సినేషన్ అయిన వారు ఆయా సర్టిఫికెట్ చూపించి యాత్రకు సిద్ధం అవ్వాలని భక్తులకు అధికారులు సూచించారు.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు, యాత్రికులు స్మార్ట్ సిటీ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకొని అనుమతి పొందాలని హై కోర్టు సూచించింది. ఈ యాత్ర కోసం ప్రతి రోజు బద్రీనాథ్ లో వెయ్యి మంది, కేదార్నాద్ లో 800 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది కి మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దరఖాస్తు దారులు తమకు రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి అయినట్టు ఆయా పత్రాలు చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  కనీసం పదిహేను రోజుల ముందు ఇవన్నీ జరిగితే బాగుంటుందని వారు చెప్పారు.
యాత్రికులు యాత్రాస్థలిలో ఏ స్నానఘట్టంలో కూడా స్నానాలు ఆచరించరాదు అనేది ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది. రుద్రప్రయాగ్, చమేలీ, ఉత్తరకాశి జిల్లాలలో పోలీసులు యాత్ర సందర్భంగా భారీగా బలగాలను ఏర్పాటు చేశారు. తాజా ఆఫ్ఘన్ ఆక్రమణ సందర్భంగా దేశంలో హై అలర్ట్ విధించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు తీవ్రవాదులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యాత్రకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది ఈ యాత్రకు సాధారణంగానే యాత్రికుల అర్హతను బట్టి అనుమతి ఇస్తున్నారు. ఎవరు బడితే వాళ్ళు ఈ యాత్రకు రానివ్వరు, కేవలం స్థిరమైన ఆరోగ్యం ఉన్న వారికే ఈ అనుమతి లభిస్తుంది. కాకపోతే ఈ సారి కరోనా కూడా మరో రకమైన జాగర్త అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: