ఇక టి.టి.డి "పాడుతా ... తీయ్యగా."..

ఇక టి.టి.డి "పాడుతా ... తీయ్యగా."..
దివంగత సినీ గాయకుడు ఎస్.బి. బాల సుబ్రమణ్యం తెలుగు  టివి ఛానల్ లో నిర్వహించిన కార్యక్రమం "పాడుతా... తీయ్యగా". అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రమాన్ని వివిధ భాషల్లో పలు ఛానళ్లు పేరు మార్చి నిర్వహించాయి. నిర్వహిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ తరహాలోనే ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.  
  పదకవితా పితామహుడుగా పేరుగాంచిన  వాగ్గేయ కారుడు,   వేంటేశ్వ‌ర స్వామి   ప్రియ భక్తుడు   తాళ్ళ పాక అన్నమాచార్యులు. |ఆయన స్వామిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు యస్.వి.బి.సి  ( శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్ )ద్వారా  విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టీటీడీ నిర్ణయించిెెెంది. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రకటించారు.  తిరుమల లోని అన్నమయ్య భవన్ లో శుక్రవారంఇందుకు సంబంధించిన ప్రోమో లను ఆయన విడుదల చేశారు.
       అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ‌హుళ ప్రాచుర్యం క‌ల్పించేందుకు " ఆదివో అల్లదివో ''  పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూరు నగరాల్లోని యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లపై పోటీలు నిర్వ‌హించాల‌ని నిర్ణయిం చినట్లు  టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి  చెప్పారు.
 తొలుత జిల్లాస్థాయిలో, ఆ త‌రువాత రాష్ట్ర‌స్థాయిలో యువ‌త‌కు పోటీలు నిర్వ‌హిస్తామన్నారు.టిటిడి రికార్డు చేసిన 4 వేల  సంకీర్తనల  నుంచే ఈ పోటీలు నిర్వ‌హించ‌డం జరుగుతుందన్నారు. తద్వారా యువతను భక్తి మార్గంలో నడిపించేందుకు ఇదొక వేదిక అవుతుందని ఆయన చెప్పారు.
  కార్యక్రమ ప్రారంభంలో చిత్తూరు జిల్లాకు చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న గాయనీ, గాయకులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆసక్తి కలిగిన గాయనీ గాయకులు పోటీలో పాల్గోోన వచ్చునని చెప్పారు. ఈ నెల 24లోగా ఎస్వీబీసీ వెబ్సైట్ లోను, నేరుగాను దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25 , 26 వ తేదీల్లో  ఎస్వీబీసీ కార్యాలయంలో సెలెక్షన్స్ నిర్వహిస్తారని శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.  నేరుగా రాలేని వారికి 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూమ్ ద్వారా  ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు.
ఈసారి కూడా  ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
   శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని చైర్మన్ వివరించారు. ఆనలైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధికమిస్తామన్నారు.   బ్రహ్మోత్సవాల సందర్భంగా  శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్  కన్నడ, హింది చానళ్ళు ప్రారంభమవుతాయనీ, ఈ చానళ్ల ద్వారా  కూడా వివిధ పోటీలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: