వినాయకుడి పూజలో గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

Vimalatha
వినాయక చతుర్థి ఈ ఏడాది దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. గణపతి మనల్ని సంతోషంగా ఉండచడానికి మనందరి మధ్యకు వచ్చారు. ఎక్కడ చూసినా వినాయక చవితి సెలెబ్రేషన్స్ తో మంచి పాజిటివ్ వైబ్స్ కన్పిస్తున్నాయి. సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమైన ఈ వేడుక సెప్టెంబర్ 19న అనంత చతుర్దశి వరకు కొనసాగుతుంది. ఈ 10 రోజులు ప్రతి ఒక్కరూ వినాయకుడిని పూజించి, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే పూజ సమయంలో మనకు తెలియకుండా, లేదా పొరపాటున చేసే కొన్ని తప్పుల వల్ల గణేశుడు సంతోషించే బదులు కోపం తెచ్చుకోవచ్చు. ఆయన ఆగ్రహానికి బలి కావొద్దు అనుకుంటే ఈ 5 ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినాయకుడికి పూలు అర్పించేటప్పుడు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే గణపతి ఆయన ఆగ్రహం వల్ల ఇంట్లో పేదరికం రావొచ్చు అనేది హిందువుల విశ్వాసం. వినాయకుడికి పుష్పాలను అర్పించేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలో తెలుసుకుందాం.
వినాయకుడికి పువ్వులు అర్పించేటప్పుడు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి. గణేశుని ఆరాధనలో దుర్వాకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే తులసిని ఆయనకు సమర్పించకూడదు. ఎండిన మరియు పాత పువ్వులను పూజలో ఉపయోగించకూడదు. ఎరుపు, పసుపు పువ్వులు వినాయకుడికి చాలా ప్రియమైనవి.  కానీ ఆయనకు వాడిపోయిన పువ్వులను అస్సలు ఇష్టం ఉండదట.  
తులసి
వినాయకుడిని లంబోదరుడు అని కూడా పిలుస్తారు. ఆయన భారీ కాయమే దానికి కారణం. ఈ కారణం చేతనే వినాయకుడిని లంబోదరుడు అంటూ పెళ్లి చేసుకోవడానికి తులసి మాత నిరాకరించింది. అందుకే వినాయకుడు ఆమెను శపించాడు. అప్పటి నుంచి వినాయకుడికి తులసి నిషేధం.
కేటకి పువ్వులు
శివుడికి కేటకి పువ్వులు అస్సలు ఇష్టం లేదు. ఈ కారణంగా ఆయన కుమారుడైన వినాయకుడికి కూడా ఈ పువ్వులు నచ్చవు. గణేష్ కు పొరపాటున కూడా కేటకి పువ్వులను పూజలో ఉపయోగించకూడదు.
బంతి పువ్వులు
బంతి పువ్వులు వినాయకుడికి చాలా ఇష్టం. గణపతి బప్పకు బంతి పువ్వులను సమర్పించడం ద్వారా అన్ని కోరికలు త్వరలో నెరవేరుతాయి.
మందార పువ్వులు
ఎరుపు, పసుపు పువ్వులు వినాయకుడికి చాలా ప్రియమైనవి. అందువలన మందార పువ్వులను వినాయక పూజలో ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా వినాయకుడు సంతోషించి అన్ని ఇబ్బందులను తొలగిస్తారు.
దూర్వా
గణేశునికి దుర్వా అత్యంత ముఖ్యమైన విషయం. ఉదయం భక్తి శ్రద్ధలతో, ఆచారాలతో పూజలు చేసి, వినాయకుడికి ఇష్టమైన పుష్పాలు, దుర్వాను పూజలో అర్పిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: