దేశంలోని 5 ప్రసిద్ధ గణేష్ దేవాలయాలు... ఒక్కసారైనా చూశారా ?

Vimalatha
సెప్టెంబర్ 10, శుక్రవారం రోజు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించిన గణేష్ చతుర్థి ప్రారంభమైంది. ఈ సమయంలో ,ఇంటింటితో పాటు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల భారీ వినాయకుడిని విగ్రహాలను పెట్టి వైభవంగా పూజిస్తారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రసిద్ధ, పురాతన గణేష్ దేవాలయాల గురించి తెలుసుకుందాం. జీవితకాలంలో ఈ దేవాలయాలను ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిందే. ఇక్కడ దర్శనం చేసుకుంటే గణపతి ప్రతి కోరికను తీరుస్తాడని అంటారు. ఈ దేవాలయాల గురించి తెలుసుకొని దేశ, విదేశాల నుండి భక్తులు వస్తారు. ముందుగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాణిపాకం వినాయకుడి గురించే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడికి పక్క రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు. ఇక్కడ బావిలో వినాయకుడు ఉద్భవించాడని అంటారు.
ఉజ్జయినిలోని చింతామన్ గణేష్ ఆలయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లో నిర్మించిన చింతామన్ గణేష్ ఆలయం దాదాపు 1,100 సంవత్సరాల నాటిది. ఈ ఆలయంలో ఉన్న గణేష్ విగ్రహాలను శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి స్థాపించినట్లు చెబుతారు. ఈ ఆలయం ప్రస్తుత నిర్మాణాన్ని హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి అహల్యాబాయి నిర్మించారు. ఈ దేవాలయ వైభవం చూడదగినది.
జైపూర్ మోతి డుంగ్రి గణేష్ ఆలయం
రాజస్థాన్ రాజధాని జైపూర్ మోతి డుంగ్రి గణేష్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న విగ్రహం 500 సంవత్సరాల కంటే పాతది. ఇది జైపూర్ రాజా మాధో సింగ్ రాణి పూర్వీకుల గ్రామం నుండి తీసుకువచ్చారు. ఈ ఆలయం కొత్త వాహనాల పూజకు చాలా ప్రసిద్ధి చెందింది.
ఇండోర్ ఖజరానా గణేష్ ఆలయం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని ఖజరానా గణేష్ ఆలయాన్ని కూడా హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి అహల్యా బాయి నిర్మించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆలయ పూజారి గణేష్ విగ్రహాన్ని భూమిలో ఉన్నట్లు కల కన్నట్లు నమ్ముతారు. దీని తరువాత దేవుని విగ్రహం ఇక్కడ త్రవ్వకాలలో బయటపడింది. ఆ తరువాత రాణి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించింది.
ముంబైలోని సిద్ధివినాయక్ ఆలయం
మహారాష్ట్రలోని ముంబై నగరంలో నిర్మించిన సిద్ధివినాయక్ ఆలయం బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ సినిమా తారలు, దేశంలోని పెద్ద పారిశ్రామిక వేత్తలు ప్రతిరోజూ తమ వ్రతాలను చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ దేవాలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో చేర్చబడింది. ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఆలయం పైభాగంలో 3.5 కిలోల బంగారు కలశం ఉంది. దీనితో పాటు ఆలయం లోపల గోడలపై బంగారు పొరను అమర్చారు.
పూణేలోని దగాడు గణేష్ ఆలయం
మహారాష్ట్రలోని పూణే నగరంలోని దగ్దుసేత్ హల్వాయి గణేష్ ఆలయం కూడా 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడి వ్యాపారవేత్త, దగ్దు సేథ్ హల్వాయ్, గురు మాధవనాథ్ మహరాజ్ ఆదేశం మేరకు తన కుమారుడు మరణించిన తర్వాత ఈ గణేష్ ఆలయాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: