మట్టి, పత్రి తో చేసిన వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..?

Divya

భాద్రపద మాసం లో మనం ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. ఆ ప్రకృతిలో తిరగడమంటే పండగలా అనిపించడమే కాకుండా మనసుకు ఎంతో హాయిగా వుంటుంది. ఇక ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ పచ్చటి తోరణాలతో మధ్య తమ జీవితంలో విజ్ఞాలను తొలగించాలని, ఆ మహా విఘ్నేశ్వరుడిని మనసులో ఆరాధిస్తూ ఉంటాము.. అదే వినాయక చవితి. వినాయక చవితి ఎప్పుడు కూడా ప్రకృతికి అనుగుణంగా కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. వర్షాకాలం తర్వాత భాద్రపద మాసం లో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, గల గల పారే నదులు, సెలయేళ్లు, సరస్సులు కూడా ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తాయి.. పవిత్రమైన నదుల దగ్గర నుంచి మట్టిని తీసుకొచ్చి, శ్రీ మహా వినాయకుడి ప్రతిమ చేసి మహా గణపతి చవితి రోజున స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ వుంటారు.
సృష్టి ,శృతి , లయ ల సమక్షంలో వినాయకుడి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఈ మూడింటిలో ఏ ఒకటి విరుద్ధంగా అనిపించినా పూజలో ఏదో దోషం వున్నట్టు భావించాలి. ఒండ్రు మట్టి ని, పత్రాలను ఉపయోగించి భగవంతుడి ప్రతిమ ఎందుకు చేస్తారు.. అంటే వీటిలో ఔషధ గుణాలు, మూలికలు ఉంటాయి . పూజ చేసే సమయంలో స్వామివారిని మాటిమాటికీ తాకుతూ ఉండటం లేదా తొమ్మిది రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల ఈ ఔషధ గుణాలు మన ఇంటిలో ఉన్న గాలిలో కలవడం వల్ల మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయి.
ఆ తర్వాత వినాయకుడిని బావిలో కానీ పారే నదిలో కానీ నిమజ్జనం చేస్తారు.ఇలా నిమజ్జనం చేసిన రోజు కూడా ఇవి భూమి లో అత్యంత వేగంగా కుళ్ళి పోతాయి..కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని ఉండకపోగా, ప్రజలకు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి. ఈ భాద్రపద మాసం లో వరదలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరదలు పోటు తగ్గుతుంది అనేది నమ్మకం. వరద నీటిలో క్రిమికీటకాలు ఉంటాయి కాబట్టి ఒండ్రు మట్టి, పత్రాలతో తయారు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు నీరు కూడా శుభ్రం అవుతుందనేది శాస్త్రంతో పాటు శాస్త్రవేత్తలు కూడా తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: