వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని ఎందుకు చూడ‌కూడ‌దంటే..?

Paloji Vinay
ఏ పూజ చేసినా, ఏ ప‌ని మొద‌లు పెట్టిన ముందుగా విఘ్నాలు తొల‌గించే విఘ్నేశ్వ‌రుడికి ఆదిపూజ చేస్తారు. భాద్ర‌ప‌ద శుద్ద చ‌తుర్థి రోజు జ‌రుపుకునే వినాయ‌క చ‌వితి పూజ దాని వెనుక ఉన్న ఇతివృత్తానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. భార‌త‌దేశంలో అతి పెద్ద పండుగ‌ల‌లో వినాయ‌క చ‌వితి ఒక‌టి. దేశ వ్యాప్తంగా భ‌క్తులు త‌మ తాహ‌త‌కు త‌గ్గ‌ట్టుగా గ‌ణ‌ష్ చ‌తుర్థి రోజు మండ‌పాల‌ను ఏర్పాటు చేసి వినాయ‌క ప్ర‌తిమ‌ను నిల‌బెట్టి పూజ‌లు చేస్తారు. ఇలా మూడు, లేదా ఐదు, ఏడు, తొమ్మిది రోజుల పాటు పూజ‌లందుకున్న లంబోద‌రుడి ప్ర‌తిమ‌ను నీళ్ల‌ల్లో నిమ‌ర్జ‌నం చేస్తారు.

   పార్వ‌తి దేవి స్నానం చేయ‌డానికి వెళ్తుండ‌గా ప‌సుపును ఓ బాలుడి రూపంలా త‌యారు చేస్తుంది. త‌రువాత ఆ ప‌సుపు ముద్ద‌కు ప్రాణం పోసి ద్వారానికి కాపాలగా ఉంచి స్నానాకి వెళ్తుంది. ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చి శివుడిని లోప‌లికి వెళ్ల‌కుంటా అడ్డుకుంటాడు బాల వినాయ‌కుడు. దీంతో కోపోద్రిక్తుడు అయిన ముక్కంటుడు త‌న త్రిశులంతో ఆ బాలుడి త‌ల న‌రికేస్తాడు. ఇది చూసిన పార్వ‌తి త‌న‌కు త‌న బిడ్డ కావాల‌ని ప‌ట్టు బ‌డుతుంది. దీంతో ప‌ర‌మేశ్వ‌రుడు గ‌జ‌ముఖుడి శిర‌స్సు తెచ్చి, బాలుడికి పెట్టి ప్రాణం పోస్తాడు. త‌రువాత భాద్ర‌ప‌ద శుద్ధ చ‌వితి రోజు గ‌ణాల‌కు అధిప‌తిగా నియ‌మిస్తారు గ‌ణ‌ప‌తిని.

  అయితే, ఆరోజు భ‌క్తితో స‌మ‌ర్పించిన కుడుములు, ఉండ్రాళ్ల‌ను, ఇత‌ర పిండివంట‌ల‌ను, పండ్ల‌ను పుష్టిగా తిని న‌డ‌వ‌డానికి ఇబ్బంది ప‌డుతూ కైలాసం చేరుకుంటాడు  లంబోధ‌రుడు. ఇది చూసిన శివుడి త‌ల మీద ఉన్న చంద్రుడు న‌వ్వుతాడు. దీంతో దిష్టి తాకిన గ‌ణ‌ప‌తి పొట్ట ప‌గిలి ఉండ్రాళ్లు, కుడుములు బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌డిపోతాడు. దీంతో ఆగ్ర‌హించిన త‌ల్లి పార్వ‌తి దేవి.. చంద్రుడిని చూసిన‌వారు పాపాత్ములై నీలాప‌నింద‌ల పాల‌వుతార‌ని శాపం పెడుతుంది.


  దీంతో ఆ త‌రువాత చంద్రుడిని చూసిన స‌ప్త రుషుల‌ పత్నులు త‌మ భ‌ర్త‌ల‌చేత విడిచిపెట్ట బ‌డుతారు.  దీంతో దేవ‌త‌లంద‌రూ బ్ర‌హ్మ‌దేవుడితో క‌లిసి పార్వ‌తీదేవి ద‌గ్గ‌ర‌కు వెళ్లి చంద్రుడికి ఇచ్చిన శాపం వ‌ల్ల ఆపద వ‌చ్చింద‌ని వేడుకుని శాపాన్ని ఉప సంహ‌రించుకోవాల‌ని ప్రాధేయ‌ప‌డుతారు. అప్పుడు పార్వ‌తీ దేవి చంద్రుడు ఏ రోజైతే వినాయ‌కుడిని చూసి న‌వ్వాడో ఆ రోజు చంద్రుడ‌ని చూడ కూడ‌ద‌ని  శాపాన్ని స‌వ‌రిస్తుంది.  కొంత కాలం త‌రువాత వినాయ‌క చ‌తుర్థి రోజు చంద్రుడిని చూసిన శ్రీ‌కృష్ణ‌డికి మ‌ర‌క‌త‌మ‌ణి దొంగ‌లించాడ‌నే నీలాప‌నింద‌లు ప‌డ్డాయి. దీంతో ఈ రోజు చంద్రుడిని చూస్తే నీలాప‌నింద‌లు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: