గ‌ణేష్ చ‌తుర్థిని ఈ రోజుతో పాటు ఇంకో రోజూ జ‌రుపుకుంటారు తెలుసా..?

Paloji Vinay
వినాయ‌క చ‌వితిని దాదాపు సెప్పెంబ‌ర్ నెల‌లోనే వ‌స్తుంది. భాద్ర‌ప‌ద మాసంలో వ‌చ్చే చ‌తుర్థ‌ని వినాయ‌క చ‌తుర్థిగా పిలుస్త‌రు. అయితే, ఆ రోజు మాత్ర‌మే కాకుండా జూన్ 24న కూడా జ‌రుపుకుంటార‌ట‌. హిందూ క్యాలెండ‌ర్ ప్ర‌కారం ప్ర‌తీ చాంద్ర‌మాసంలో రెండు చ‌తుర్థిలు వ‌స్తాయి. హిందూ గ్రంథాల ప్ర‌కారం, చ‌తుర్థి తిథిని వినాయ‌కుడి తిథిగా చూస్తారు. అమావాస్య త‌రువాత వ‌చ్చే శుక్ల ప‌క్షం చ‌తుర్థి గ‌ణేష్ చ‌తుర్థి. పౌర్ణ‌మి అనంత‌రం వ‌చ్చే కృష్ణ ప‌క్షం చ‌తుర్థిని సంక‌ష్ట చ‌తుర్థిగా పిలుస్తారు. అయితే వినాయక చతుర్థి వ్రతం, ఉపవాసం చేయాలనుకునే వారు ప్రతీ నెలలో కూడా చేయొచ్చు. కానీ భాద్రపద మాసంలో వచ్చే చతుర్థినే అతి ముఖ్యమైన వినాయక చ‌వితిగా భ‌క్తులు విశ్వ‌సిస్తారు.

భాద్రపద మాసం సమయంలో వచ్చే చ‌తుర్థిని వినాయ‌కుని పుట్టిన తిథిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తారు. భాద్ర‌ప‌ద చ‌వితి రోజు వినాయ‌క ప్ర‌తిమ‌ను ప్ర‌తిష్టించి బేసి సంఖ్య వ‌చ్చే విధంగా మూడు రోజులు, ఐదు రోజులు, లేదా ఏడు రోజులు , తొమ్మిది, ప‌ద‌కొండు రోజుల పాటు ఏక‌దంతుడిని విగ్ర‌హాన్ని పూజించి న‌దిలో లేదా చురువులో నిమ‌ర్జ‌నం చేస్తారు. ఈ సారి భాద్ర‌ప‌ద మాసంలో వ‌చ్చే గ‌ణేష్ చ‌తుర్థి ఈ రోజు జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

 వినాయ‌కుడి పూజ విధానం , ప్రాముఖ్యత
   గ‌ణ‌ప‌తి పూజలో విఘ్నేశ్వ‌రుడిని ఆరాధించడం వ‌ల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శాస్త్రాలు గోషిస్తున్నాయి.  అందుకే ఏ పూజ చేసినా, ఏ కార్యక్ర‌మం మొద‌లుపెట్ట‌నా ముందుగా గ‌ణ‌ప‌తి పూజ చేయ‌డం ఆచారంగా వ‌స్తోంది. అత్యంత భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వ‌రుడిని కొలిచే వాళ్ల‌కు ఎలాంటి ఆటంకాలు, అవ‌రోధాలు రావ‌ని విశ్వ‌సిస్తారు. వినాయ‌క చ‌వితో రోజున గ‌ణేషుడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి ప‌లు ర‌కాల పూలు, 21 ర‌కాల వివిధ ప‌త్రాలతో పూజిస్తారు. బొజ్జ‌గ‌ణ‌ప‌య్య‌కు నైవేద్యంగా ఆయ‌న‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన కుడుములు, ఉండ్రాళ్ల‌ను నివేదించి త‌మ విఘ్నాల‌ను తొల‌గించి మ‌మ్మ‌ల్ని కాయ‌వ‌య్య లంబోదర అంటూ పార్వ‌తి త‌న‌యుడిని ఆరాధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: