ముంబై లో .. మండపాలు .. ఆన్ లైన్ దర్శనం ముద్దు ..

నేడు యావత్ భారతదేశం గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటుంది. అయితే కరోనా ఉండనే ఉంది, గత రెండేళ్లుగా ఏ ఉత్సవాన్ని సరిగా చేసుకోనివ్వకుండా అడ్డుకుంటూనే ఉంది. ఈసారి అదే గెలిచింది. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు కూడా పెద్దగా ఎక్కడా అనుమతులు లేవు. అసలైతే ఈ ఉత్సవానికి నెలరోజుల ముందే సందడి చందాలను వసూలు చేయడంతో మొదలవుతుంది. గణేష్ విగ్రహాలను తయారు చేసేవారికి కూడా అప్పటి నుండే పని బాగా ఉంటుంది. కానీ కరోనా చేయగా ఇవన్నీ మారిపోయాయి. అయినా ఈసారి కాస్త తెరపిచ్చింది అనుకుని విగ్రహాలకు డిమాండ్ ఉంటుందేమో అని కొందరు తయారు చేసుకున్నారు. కానీ, బహిరంగ ప్రదేశాలలో మండపాలు పెట్టి ఉత్సవాలు చేయరాదని, ఐదుగురు కంటే ఎక్కడా గుమికూడకూడదు అనే నియమాలు ఉత్సవంలో కళను లేకుండా చేసేశాయి.
ఈ విషయంపై కూడా ఆయా రాష్ట్రాలలో అధికార పార్టీని విపక్షాలు ఆడుకుంటూ, దీనికి కూడా రాజకీయ రంగు పులిమేశాయి. కేంద్రం ఆదేశాల మేరకే చాలా రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాలలో ఈ ఉత్సవాలకు అనుమతి నిరాకరించారు.. కానీ విపక్షాలు మాత్రం మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపేస్తున్నాయి. ఇక ఈ విషయం కోర్టు వరకు వెళ్లడంతో మరోసారి ఆలోచించిన న్యాయస్థానం కూడా మండపాలు అసలు పెట్టకూడదు అని చెప్పకుండా, పెట్టినా కూడా వాటిలో కూడా ఐదుగురు కంటే గుమికూడదు అని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకే దేశంలో నిబంధనలతో కూడిన గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే మండపాలు ఉన్నా పెద్దగా మనుషులు ఉండరు అన్నమాట. కరోనా ముందు అయితే గణేష్ ఉత్సవాలు అంటే సందడి అంతా మండపాల దగ్గరే ఉండేది. దేశఆర్ధిక రాజధాని ముంబై లో అయితే ఈ ఉత్సవాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు, అంత బాగా నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని చూడటానికే వీక్షకులు ఎక్కడెక్కడి నుండో వచ్చే వాళ్ళు. కానీ ప్రస్తుతం కరోనా చేయబట్టి, మండపాలు ఉన్నాయి కానీ, అంతా ఆన్ లైన్ దర్శనాలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోని అక్కడి వారు అందరికి ఆదర్శప్రాయం కూడా అయ్యారు. మహా నగరాలలో ఈ ఉత్సవాలకు పెట్టింది పేరు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ ఎలాగో, ముంబై లో కూడా కింగ్స్ సర్కిల్ గణేష్ మండపం అంతే. తెలంగాణాలో అయితే కాస్త నిబంధనలు సడలించారు కానీ ముంబై లో అయితే ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి, అందుకే అంతా ఆన్ లైన్ దర్శనమే చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: