కృష్ణాష్టమి పూజా విధానము, ముహూర్తం

Vimalatha
కృష్ణాష్టమి వేడుకలను ఎక్కువగా నార్త్ ఇండియన్స్ జరుపుకుంటారు. ఇటీవల కాలంలో సౌత్ లో కూడా జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథిలో జన్మించాడు. ఈ ఏడాది ఆగష్టు 30న కృష్ణాష్టమి. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు అర్ధరాత్రి శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. ఈసారి రోహిణి నక్షత్రం, చంద్రుడు వృషభరాశిలో ఉండడం, సర్వార్థ సిద్ధి యోగం కూడా జన్మాష్టమి నాడే ఏర్పడడం విశేషం. సర్వార్థసిద్ధి యోగంలో పూజలు, శుభ కార్యాలను ప్రారంభించడం మంచిదని నమ్ముతారు.
జన్మాష్టమి 2021 పూజ ముహూర్తం పూజ ముహూర్తం 30 ఆగష్టు రాత్రి 11.59 నుండి అర్థరాత్రి 12:44 వరకు ఉంది. జన్మాష్టమి రోజున బాలకృష్ణుడి రూపాన్ని పూజించాలి. గోపాలుడికి దక్షిణ వర్తి శంఖంతో అభిషేకం చేయాలి. అలాగే కుంకుమ కలిపిన పాలతో స్నానం చేయించాలి. కృష్ణుడిని ప్రతిష్ఠించేటప్పుడు, క్రిమ్ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అభిషేకం తరువాత కిష్ణుడి ప్రతిమను బట్టలతో అలంకరించాలి. ఆయనకు ఇష్టమైన వైజయంతి దండ, వేణువు, నెమలి ఈకలు, గంధం, తులసి దండ వేయాలి. తర్వాత ధూప దీపం వెలిగించి ఆయనను పార్థించాలి. ఆయనకు హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ హారతితో పాటు ప్రసాదం ఇవ్వాలి.
ఇక శ్రీ కృష్ణుడు ప్రతి క్షణం వేణువును తన చెంతనే ఉంచుకునేవాడు. అది ప్రేమ, శాంతిని చేకూరుస్తుందని నమ్ముతారు. అందుకే కృష్ణాష్టమి రోజున వెదురు వేణువుతో పూజ చేసి , దానిని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ఎలాంటి వాస్తు దోషం అయినా సరే నివారణ జరిగిపోతుంది అంటారు. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత, భార్యభర్తల మధ్య ఉన్న గొడవలు, కలతలు ఇలా ఏవైనా తొలగిపోతాయని అంటారు. శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించి సంతోషంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: