"రక్షా బంధన్" రోజున ఈ పనులు అస్సలు చేయకండి

Vimalatha
"రక్షా బంధన్" పండుగ సోదరుడు, సోదరి ప్రేమకు అంకితం చేయబడింది. ఈ పండుగను భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం రాఖీ ఆగస్టు 22, ఆదివారం వచ్చింది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడికి దీర్ఘాయువు, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటూ రక్షణ కవచాన్ని కడతారు. దీనిని రాఖీ అంటారు. అదే సమయంలో సోదరి తన సోదరునికి హారతి ఇచ్చి, నుదిటిపై తిలకం దిద్ది, స్వీట్లతో అతని నోరు తీపి చేస్తుంది. ప్రతిగా సోదరులు తమ సోదరికి బహుమతులు ఇస్తారు. పురాణ గ్రంథాల ప్రకారం రక్షా బంధన్‌పై కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. చాలా సార్లు మనం ఈ విషయాలను విస్మరిస్తాము. కానీ అది సరైంది కాదు. రక్షాబంధన్ పండుగలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
భద్ర, రాహు సమయాన్ని గుర్తుంచుకోండి
సోదరుడి రాఖీ కట్టే సమయంలో ముహూర్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున భద్రా, రాహుకాలంలో మర్చిపోయి పొరపాటున కూడా రాఖీ కట్టకూడదు. ఈ రెండు సమయాలను అశుభంగా భావిస్తారు. భద్ర , రాహుకాలంలో చేసిన పనిలో విజయం సాధించలేరు.
దిశను జాగ్రత్తగా చూసుకోండి
వాస్తు శాస్త్రం ప్రకారం రాఖీ కట్టేటప్పుడు దిశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాఖీ కట్టేటప్పుడు సోదరి ముఖం దక్షిణ దిశలో ఉండకూడదని సోదరీమణులు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా వారు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి.
మీ సోదరికి ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వవద్దు
సోదరులు రాఖీలో తమ సోదరికి బహుమతులు ఇస్తారు. కానీ ఈ పవిత్రమైన సందర్భంలో రుమాలు, టవల్ సోదరికి బహుమతిగా ఇవ్వకూడదు. దీనితో పాటు పదునైన వస్తువులు కూడా సోదరీమణులకు ఇవ్వకూడదు. అంతే కాకుండా అద్దాలు, ఫోటో ఫ్రేమ్‌లు వంటి బహుమతులు ఇవ్వడం మానుకోండి.
ఈ రంగును నివారించండి
రక్షాబంధన్ సందర్భంగా మీరు నలుపు రంగును ఉపయోగించకూడదు. ఈ రంగు ప్రతికూలతను సూచిస్తుంది. వీలైతే మీ సోదరుడి రాశి ప్రకారం రాఖీ రంగును ఎంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: