శ్రావణ శనివారం : ఈ దీపంతో అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం..?

Divya
శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమ, పోలాల అమావాస్య, ఏకాదశి వంటి రోజులను అత్యంత పవిత్రంగా భావించి, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక పోతే నిన్న దేశవ్యాప్తంగా ఆడవారు అందరూ వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు అనగా శనివారం ఆగస్టు 21వ తేదీన అమ్మవారికి ఈ ప్రమిదతో దీపం వెలిగించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
శ్రవణా నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి అతి ముఖ్యమైన రోజు గా కొలుస్తాము. ఇట్టి శ్రవణా నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల , స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. ఈ పూజకు ముఖ్యంగా కావలసినవి వస్తువులు, అలంకారాలు కావు.. అతి ముఖ్యమైనది సమయం. అంటే తెల్లవారు జామున 3:00 గంటలకు పూజను మొదలుపెట్టాలి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కి అత్యంత ప్రాధాన్యమైన సమయం. ఎందుకంటే ప్రపంచంలో శాస్త్రోక్తంగా ప్రతిష్టించిన దేవతా విగ్రహాలకు రెప్పపాటు సమయం. శ్రీ మహా విష్ణువు ఈ సమయంలో తన రూపాన్ని దాల్చి రెప్పపాటు సమయంలో యధావిధిగా విగ్రహ రూపంలోకి మారి పోతారు.
కాబట్టి ఇంతటి పవిత్రమైన సమయంలో స్వామి వారికి ఆవునెయ్యితో దీపం పెట్టి, తేనెను నైవేద్యంగా సమర్పించాలి. ఈ సమయంలో పూజ చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది. వీరు మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటారు. శ్రావణమాసం శ్రవణా నక్షత్రం శనివారం రోజున ,వరి పిండి దీపం తయారు చేసి ,  నెయ్యితో దీపం వెలిగించడం  వల్ల అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని తప్పకుండా ఆచరించి, శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సమయం పూజ చేయలేని వారు ఉదయం 6:00 నుంచి 11:00 గంటల మధ్య సమయంలో శ్రీనివాసుడికి పూజను చేయవచ్చు. ఈ పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం లభించి, ఎల్లవేళల సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు.
ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమోస్తుతే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: