సంక్రాంతి: నాటి లంగా ఓణీలు, జ‌డ‌లు పోయే... మోడ్ర‌న్ డ్రెస్సులు వ‌చ్చే

Durga Writes

మకర సంక్రాంతి.. ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. పిల్లలు గాలి పాఠాలు ఎగరేస్తూ.. ఇంట్లో అమ్మ వాళ్లకు అమ్మమ్మలు పిండి వంటలు చేస్తూ.. బయట ఆడపిల్లలు రంగు రంగు ముగ్గులు వేస్తే సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా చేసుకుంటారు. 

 

అందుకే సంక్రాంతి పండుగా కోసం ప్ర‌తి ఒక్క‌రు కొత్త బ‌ట్టలు కొనుక్కుంటారు. సంక్రాంతి పండుగాకు ఇంకా 10 రోజులకు ముందే సంక్రాంతి పండుగ కోసం కొత్త బట్టలను కొంటారు. అయితే ఆ సంక్రాంతి షాపింగ్ తీరే వేరుగా ఉంటుంది. నాటికి నేటికి సంక్రాంతి షాపింగ్ ఎంత మారింది అంటే అది చెప్పలేనిది. 

 

అప్పట్లో ఆడపిల్లల కోసం లంగా ఓణీలు కొనే వారు.. ఆడపిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఆ బట్టలను తీసుకునే వారు. కానీ ఇప్పుడు.. లంగాఓణీ అంటే చాలు.. నువ్వు నీ పాతకాలం వేషాలు అంటూ ఫైర్ ఫైర్ అవుతారు. సంక్రాంతి వచ్చింది అంటే అమ్మ వేసిన ముగ్గులతో నేను ఏ వేసా అని కలరింగ్ ఇచ్చుకోడానికి సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెడుతారు తప్ప ఆడపిల్లలు అసలు లంగా ఓణీలు వేసుకోరు. 

 

ఇంకా చెప్పాలంటే.. అప్పట్లో అచ్చ తెలుగు ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకొని పొడుగు జడ నిండా పూలు పెట్టుకొని సంబరాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఫోటోలకు తప్ప అవి వేసుకోవడం లేదు. పండగ అయినా ఇంకేమైనా అయినా మోడ్రన్ డ్రస్సులే ఇప్పుడు వారికీ కంఫర్టు. అది కాదు అమ్మ అని అన్నమంటే.. అలుగుతారు. ఇది ఈనాటి సంక్రాంతి మోడ్రెన్ డ్రెస్సులు సంగతి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: