దేవుళ్లు : ఏసుక్రీస్తు ఎవరు..?

సమస్తమును ఆయన మూలముగా కలిగెను.కలిగి యున్నదేదియు ఆయన లేకుండ కలగలేదు. (యోహాను సువార్త.1.3) నిజానికి ఏసును గూర్చి ఇందులో ఏమీ చెప్పలేదు. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద యుండెను" అని అంతకు ముందు యోహాను.1.1,2 వాక్యాలలో వ్రాసి ఉంది. ఇక్కడ "వాక్యమే దేవుడు" అని యోహాన్ చెప్పాడే కాని " వాక్యమే ఏసు " అని ఎక్కడా వ్రాయ లేదు. ఆది కాండము లో ఎహోవా ఒక్కడే దేవుడని చెప్పారు. యోహాను తన సువార్త లో దేవుడు దైవ కుమారుడు ఒకరే అని చెప్పలేదు. అలాంటపుడు దేవుడే దేవుని కుమారుడు అని చెప్పటం కరెక్ట్ కాదు. ఆది కాండలో దేవుడే సృష్టికర్త యని చెప్ప బడింది. దేవుని కొడుకు ఏసు సృష్టి కర్త అని చెప్పలేదు. ఏసు పుట్టకముందు కోట్ల సంవత్సరాల క్రితమే సృష్టి యేర్పడిందనేది అందరికి తెలిసిన సత్యం. చరిత్రను తనకు ముందు తన తరువాత అని రెండుగా విభజించిన యుగపురుషుడు; ప్రపంచ మానవాళికి ప్రేమ,ఆప్యాయతలను, శాంతి వంటి మంచి లక్షణాలతో పాటు శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు యేసు క్రీస్తు.

 

పాపాల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి జన్మించిన క్రీస్తు ఆ ప్రజల మంచి కోసమే ముళ్ల కిరీటాన్ని ధరించి, సిలువపై రక్తం చిందించాడు. మృతి చెందిన మూడు రోజుల అనంతరం మళ్లీ కనిపించి, పునరుత్ఖాతనం చెంది మరణాన్ని జయించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు.మేరి, జోసెఫ్‌ల కుమారుడు ఏసుక్రీస్తు. అయితే మేరి నిశ్చితార్థం అనంతరం ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని జోసెఫ్‌కు కలలో దేవ దూత కనిపించి, మేరి గర్భం దేవ సంకల్పమని, పుట్టబోయేవాడు పాపుల రక్షకుడని, అతడికి క్రీస్తుగా నామకరణం చేయాలని, ఆమెను భార్యగా అంగీకరించాలని చెప్పి అంతర్ధానమవుతుంది. దీంతో జోసెఫ్‌ మేరిని వివాహమాడతాడు. అనంతరం దైవ దూత చెప్పినట్లుగానే జోసెఫ్‌ నడుచుకున్నాడు.

 

బెత్లహేంలోని పశువుల పాకలో మేరి మగ శిశువుకు జన్మనివ్వగా, కలలో చెప్పినట్లుగానే ఆ దంపతులు బిడ్డకు క్రీస్తుగా నామకరణం చేశారు. సరిగ్గా యేసు జన్మించిన సమయంలో ఆకాశంలో నక్షత్రం మెరవగా, దాని ఆధారంగా ముగ్గురు జ్ఙానులు యేసును చూసేందుకు వచ్చారు. అంతేగాక యూదుల రాజు జన్మించాడని వారు స్తుతిస్తారు. శకాబ్ది 293-306 సం|| లలో పరిపాలించిన కాన్ స్టాంటియస్ క్లోరస్ అనే రోమన్ చక్రవర్తికి హెలెనా అనే ఉంపుడుగత్తె ఉండేది. ఆ రోమన్ చక్రవర్తికి హెలెనాకు పుట్టినవాడే కాన్ స్టాంటైన్ (రోము సామ్రాజ్య వారసుడు). అతనికి తల్లి అంటే చాలా అభిమానం. కాన్ స్టాంటైన్ చక్రవర్తి అయ్యాక తల్లి హెలెనా అపరిమితమైన అధికారం చలాయించేది. రోము చక్రవర్తులు క్రైస్తవులను హింసిస్తూ ఉండటం వలన ప్రజలలో పలుకుబడి ఉన్న మత ప్రచారకులు కాన్ స్టాంటైన్ ఒక ఉంపుడుగత్తె కొడుకు అనిప్రచారం చేసే వారు. ఒక సారి హెలెనా యెరుషలెం ప్రాంతం లో పర్యటించింది. క్రైస్తవులను అభిమానించ సాగింది. తల్లి ప్రోద్బలం మీద తాను క్రైస్తవ చక్రవర్తిగా కీర్తి సంపాదించాలనుకున్నాడు.

 

శకాబ్ది 321 సం. తరువాత క్రైస్తవులకు శిలువ శిక్ష ను రద్దు చేసి కాన్ స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవుల కోసం చర్చిలు నిర్మింప జేసాడు. అప్పటి వరకూ హిబ్రూ భాషలో బైబిల్ పాతనిబంధ పుస్తకాలు మాత్రమే ఉండేవి వాటిల్లో ఏసును గురించి ఏమీ వ్రాసిలేదు. ఏసు సమకాలికుడైన పౌల్ మహాశయుడు వ్రాసిన సువార్త పత్రికల వంటివి మతాధికారుల దగ్గర ఉన్నవన్నీ తెప్పించి క్రైస్త పండితులచేత కొత్తనిబంధన వ్రాయించాడు. అంటే ఏసు చనిపోయిన 300 సంవత్సరాల కాన్ స్టంటైన్ చక్రవర్తి బైబిల్ కొత్తపుస్తకం వ్రాయించాడు. 

 

అయితే ఇప్పటికీ కొంతమంది నాస్తికులు, హేతువాదులు, మరియు క్రైస్తవ మతం విశ్వసించని వారు ఎన్నో సందేహాలను, ప్రశ్నలను, ఆరోపణలను బైబిల్ పైన మరియు ఏసుక్రీస్తుపైన చేస్తున్నారు, వాటిలో ప్రధానంగా ఏసుక్రీస్తు 12 ఏళ్ళనుండి 30 ఏళ్ళ మధ్య కాలంలో ఎక్కడ ఉన్నారని, ఏం చేసారని, ఆ సమయానికి సంబంధించిన విషయాలు ఏవీ ఇన్ని రకాలైన బైబిల్స్ లో లేవనే ప్రశ్న ప్రధానంగా వినపడుతోంది.?  ఆ సమయంలో ఏసుక్రీస్తు కొంతమంది అరబ్ వర్తకులతో కలిసి ప్రపంచం పర్యటించి వచ్చ్రని కొంతమంది చెప్తున్నారు.  కొంతమంది ఆ 18 ఏళ్ళు ప్రపంచానికి అప్పట్లో విజ్ఞాన ఖని అయిన నలంద విశ్వవిద్యాలయంలో ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాడని చెప్తున్నారు. కొంతమంది ఏసుక్రీస్తు ఆ 18 ఏళ్ళు భారతదేశానికి వచ్చి, హిమాయలయాలలో మహావతార్ బాబాజీ శిష్యరికం చేసారని చెప్తున్నారు. అయితే ఈ విషయాలపట్ల సరైన ఆధారాలు లేవు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: